Saturday 1 March 2014

ఆక్సిజన్ లేకుండానే బతకొచ్చట..!

జీవి తొలినాళ్లలో ఆక్సిజన్ లేకుండా మనుగడ సాగించిందా..? ఇప్పుడున్న ఆక్సిజన్ స్థాయికి అప్పటి ఆక్సిజన్ స్థాయికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందా..? అత్యధిక ఆక్సిజన్ ఉంటేనే జీవుల మనుగడ సాగుతుంది అని చెబుతున్న జీవపరిణామా సిద్ధాంతాన్ని ఇప్పుడు తిరగరాయాలా..? అంటే అవునంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ శాస్త్రవేత్తలు.
           అయితే బాల్టిక్ సముద్రానికి చెందిన డానిష్ ఫోర్డ్ అనే ఓ ముఖ ద్వారం ప్రాంతంలో గల సముద్ర స్పంజికలపై జరిపిన పరిశోధనలో, అత్యధిక స్థాయి ఆక్జిజన్ లేకుండానే జీవి మనగలుగుతుందని తేలింది. ప్రస్తుతం వాతావరణంలో ఆక్సిజన్ శాతం 20. 95 ఉన్నది. ఇది 0.5 శాతం ఉన్నప్పటికీ జీవులు మనుగడ సాగించగలవని ఈ పరిశోధనలో తేలిందని సమాచారం.

No comments:

Post a Comment