Saturday 1 March 2014

సీఎం పదవికి కిరణ్ రాజీనామా..!


jcrop-preview

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే రాజీనామా చేసినట్లు కిరణ్ ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన మూడు సంవత్సరాల రెండు నెలల 19రోజుల పదవీ కాలానికి తెరపడింది. 2010 నవంబర్ 25న సీఎంగా ప్రమాణం చేసిన కిరణ్.. 2014 ఫిబ్రవరి 19న విరమణ ప్రకటించారు. దీంతో.. ఇప్పటి వరకూ అవిభక్త ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో 16వ, చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి నిలిచిపోనున్నారు...
ఓట్లు, సీట్ల కోసం.. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు..       కేవలం రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విభజన తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 50ఏళ్లపాటు ఎంతో మంది చేసిన పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, అలాంటి రాష్ట్రాన్ని 58 ఏళ్ల తర్వాత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment