Wednesday 5 March 2014

ఫేస్ బుక్ 'లైవ్ చాట్' కు డుమ్మా కొట్టిన మోడీ..! (కారణం అదేనట..!?)


http://www.10tv.in/news/national/Narendra-modi-not-attends-to-Facebook-Live-Chat-32359
సోషల్ మీడియాను పెద్ద మొత్తంలో వినియోగిస్తున్న రాజకీయ నేతల్లో నరేంద్ర మోడీ ముందుంటారని ఓ ప్రచారం.. ఈ పనికోసం ఆయన వద్ద పెద్ద సంఖ్యలో ఐటీ నిపుణులు సైతం పనిచేస్తుంటారని మరో సమాచారం.. మరి.. ఈ విషయాలు తెలుసుకున్నారో..? ఏమో..? తెలియదుగానీ.., భారత్ లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా 'ఫేస్ బుక్' సంస్థవారు ప్రారంభించిన ''లైవ్ చాట్'' కార్యక్రమాన్ని మోడీతో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం 'మార్చి 3'గా నిర్ణయించారు. ఈ విషయాన్ని మూడు నెలలు ముందుగానే మోడీకి తెలియజేశారు. దీనికి 'తప్పకుండా వస్తా..' అని మోడీ హామీ ఇచ్చారు. మార్చి మూడో తారీఖు రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఇక లైవ్ చాట్ ప్రారంభం కాబోతోందని భావిస్తున్న తరుణంలో 'ఫేస్ బుక్' సంస్థకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ''లైవ్ చాట్ కార్యక్రమానికి మోడీ రావట్లేదు..'' అని దాని సారాంశం. దీంతో.. ఏం చేయాలో అర్థంకాని నిర్వాహకులు ''ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది.. దీనికి ఎంతగానో చింతిస్తున్నాం..'' అంటూ మోడీ కోసం ప్రశ్నలు పంపిన వారికి మెసేజ్ చేశారు. అయితే.. ఇదంతా మొన్న జరిగిపోయిన, అందరికీ తెలిసిన విషయం. కానీ.. ఇందుకు గల కారణాలు ఏంటనేది చాలా మందికి తెలియని అంశం..!
అదేమంటే..?
     
ఫేస్ బుక్ 'లైవ్ చాట్'లో పాల్గొంటానని రెండు నెలల ముందే మోడీ నిర్వాహకులకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆఖరి నిమిషంలో మాత్రం మొహం చాటేశారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే.. ఇప్పటి వరకూ 'లైవ్' లో ప్రజలు అడిగే ప్రశ్నలకు మోడీ నేరుగా సమాధానం ఇవ్వలేదు. నిజానికి మోడీ తన ప్రచారానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ.. కొన్ని కార్పొరేట్ సంస్థల నిర్ణయాన్ని శిరసావహిస్తారని ప్రచారం సాగుతోంది. ఎప్పుడు, ఎక్కడ సభలు పెట్టాలో..? ఆ సభల్లో ఏం మాట్లాడాలో..?? మొత్తం స్క్రిప్టు తయారు చేసేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉంటాయట! ఆ స్క్రిప్టు ప్రకారమే మోడీ మాట్లాడుతారట!! అలాంటి మోడీ.. ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొంటే.. ప్రజలు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా మోడీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది గుజరాత్ అభివృద్ధి కావొచ్చు, బిజెపి ఆర్థిక విధానాలు కావొచ్చు లేదా మతకలహాలకు సంబంధించినవి కావొచ్చు. ఇలా.. నేరుగా ప్రజలు సంధించే బాణాల్లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మోడీ భయపడ్డారని, అందుకే.. 'లైవ్ చాట్' కు దూరమయ్యారని ప్రచారం సాగుతోంది.
సిద్ధంగా వేలాది ప్రశ్నలు.. ముందుగానే చెప్పాలన్న మోడీ..!
     
ఫేస్ బుక్ 'లైవ్ చాట్' లో మోడీ పాల్గొంటున్నారనే ప్రచారం మొదలైన నాటి నుండి మార్చి 3 వరకు కొన్ని వేల ప్రశ్నలు ఫేస్ బుక్ నిర్వాహకులకు అందాయి. వీటిలో కొన్ని ప్రశ్నలను ఎంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నవారు మోడీని అడగాల్సి ఉంది. అయితే.. తనను ఏ ప్రశ్నలు అడుగుతారో రెండు రోజుల ముందే తనకు చెప్పాలని మోడీ.. కార్యక్రమ నిర్వాహకులకు షరతుపెట్టారట. రెండు రోజుల ముందు ప్రశ్నలు చెబితే.. వాటి సమాధానాలు ముందే సిద్ధం చేసుకోవచ్చని మోడీ భావించారు(?) దీనికి నిర్వాహకులు ఒప్పుకోలేదు. 'లైవ్ చాట్' కాబట్టి ఆ విధంగానే వ్యవహరించాలని వారు మోడీకి సూచించారట. దీంతో.. తాను అసలు కార్యక్రమానికి రానుపోండి.. అంటూ మోడీ డుమ్మా కొట్టాడని టాక్.
   దీనికి బిజెపి మాత్రం సరికొత్త కలరింగ్ ఇస్తోంది. మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్, లాలూ లాంటి తక్కువ స్థాయివారిని పిలిచారని, అందుకే ఆయన వెళ్లలేదని ప్రచారం మొదలు పెట్టారు.

see more at : www.10tv.in