Saturday 1 March 2014

చెత్త బండి మొరాయించింది..!! ఎందుకంటే..?!



రాష్ర్టంలో చెత్త బండి మొరాయించింది..! ఇక కదలలేనంటోంది..! ఎందుకంటే..? చెత్తబండిని నడిపించే కార్మికుడు సమ్మెబాటపట్టాడు... కనీస వేతనాలు ఇవ్వాలని రోడ్డెక్కాడు. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నాడు.. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదు... కార్మికులకు న్యాయం చేయడాన్ని అటుంచి.. చెత్త ఎత్తే పనులను రాంకీ అనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తామని జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ మాజిద్ హుస్సేన్ కార్మికులను బెదిరిస్తున్నారు. దీంతో కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తోంది... ఫలితంగా చెత్త ఎత్తే దిక్కులేక హైదరాబాద్ నగరం, రాష్ర్టంలోని పలు పట్టణాలు మురికి కూపాలుగా మారిపోయాయి. గల్లీ గల్లీ గలీజుగా మారి కంపుగొడుతున్నాయి.
చాలీచాలని జీతాలతో సతమతం..       మున్సిపల్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం చాలీచాలని జీతాలు చెల్లిస్తోంది. ఇప్పుడు చెల్లిస్తున్న వేతనాలు పెరిగిన ధరల కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఏ మూలకూ సరిపోవడం లేదని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో అప్పుల పాలవుతున్నామని, కనీస వేతనం రూ.12,500 చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని....See More 

No comments:

Post a Comment