Wednesday 30 April 2014

మైనింగ్ మాఫియాకు 'గల్లా'అండ.
galla aruna kumari, Mining ,sakshi, 01.05.14

జనం ఓటెత్తారు...తెలంగాణలో 72శాతం పోలింగ్

జనం ఓటెత్తారు...తెలంగాణలో 72శాతం పోలింగ్ 
                                                     elections2014, telangana, 01.05.14

చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు..సాక్షి స్పేషల్

చంద్రబాబును వదిలి  రామోజీ దగుల్బాజీ రాతలు..సాక్షి స్పేషల్ 
specials, sakshi, 01.05.14

అధినేతలు...ఉల్లంఘనలు!...

అధినేతలు...ఉల్లంఘనలు!...
specials, sakshi, 01.05.14

టీఆర్‌ఎస్‌లో నూతనోత్సాహం..

TRS


హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఎన్నికలు, కొత్త రాష్ట్రంలో మొదటి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జరిగిన పోలింగ్ సరళి, పెరిగిన పోలింగ్ శాతం ఆ పార్టీ విశ్వాసాన్ని మరింత పెంచింది. అధికార పగ్గాలపై ఆశలను రెట్టింపు చేసింది.
కాంగ్రెస్ నేతల కుదేలు..
         
కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయడం ఆ పార్టీకి మైనస్ అని 40 సీట్లకు మించి రావనే చర్చ ఎన్నికల ప్రారంభంలో జరిగింది. కానీ రాజకీయ మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ తన వ్యుహాలకు పదును పెట్టడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు కేసీఆర్ కౌంటర్ ఎటాక్ కు పొన్నాల, దామోదర లాంటి నేతలు మాట్లాడినా దిగదుడుపే అయ్యింది. చివరకి టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలనూ చేర్చుకొని వారితో కేసీఆర్ ను తిట్టించినా కేసీఆర్ మాటల యుద్ధం ముందు కాంగ్రెస్ నేతలు బావురమన్నారు. వీటికి తోడు మూడో ఫ్రంట్ కు అనుకూలమని, మోడీ దుష్మన్ అంటూ చేసిన ప్రకటనలు, మైనార్టీల అండ తమ పార్టీకి పెరిగేందుకు తోడ్పడ్డాయనే భావన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
కలిసొచ్చిన పవన్‌ వ్యాఖ్యలు..!
            
గతం వారం రోజులుగా తెరపైకి తెచ్చిన మోడీ యూటీ ప్రకటన కేసీఆర్ కు యూత్ లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని విశ్లేషకులంటున్నారు.ఇక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ హైదరాబాద్ ను యూటీ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటన చేయిపిస్తారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య యూత్ లో టీఆర్ఎస్ కు మరింత ఓట్లు తెచ్చిపెట్టాలా చేసి ఉండవచ్చనే అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ ను కేసీఆర్ మీదకు బిజెపి, టీడీపీ నేతలు వదిలారు. కానీ పవన్ వ్యాఖ్యలు కేసీఆర్ కు మరింతగా ప్లస్ అయ్యాయని విశ్లేషకులంటున్నారు. మొత్తానికి పెరిగిన ఓటింగ్ శాతం యూత్ ఓటింగ్ లో పాల్గొన్నారనే సంకేతం పంపుతోంది. ఇది టీఆర్ఎస్ ఓటే కావొచ్చనే అనే చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్‌లో పెరిగిన ఆశలు..
       
టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ ఓటింగ్ శాతం పెరగడం పార్టీలో ఆశలు మరింత పెంచుతోంది. మొత్తానికి గులాబీ దళానికే అత్యధిక సీట్లు వస్తాయనే చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ జరుగుతోంది. అయితే ఈవిఎంలో నిక్షిప్తమైన నేతల, పార్టీల తలరాత తెలుసుకోవాలంటే మరో పదిహేను రోజులు ఆగాల్సిందే.

సుపరిపాలన దిశగా...

సుపరిపాలన దిశగా...
specials, namasthe telangana, 01.05.14 

ఎన్నికలే ప్రజాస్వామ్యమా?...

ఎన్నికలే ప్రజాస్వామ్యమా?...
specials, namasthe telangana, 01.05.14

ఈవీఎంలలో భవిత

ఈవీఎంలలో భవిత
specials, namasthe telangana, 01.05.14

హంతకులను నిర్దోషులంటే ఎలా?

హంతకులను నిర్దోషులంటే ఎలా?
specials, prajasakshi, 01.05.14

మేడే దీక్ష

మేడే దీక్ష 
                                                              specials, prajasakthi, 01.05.14

కార్పొరేట్ల సేకుడి ఎంపిక కోసమేనా ఈ 'ఎన్నికలు'?

కార్పొరేట్ల సేకుడి ఎంపిక కోసమేనా ఈ 'ఎన్నికలు'?
specials, prajasakshi, 


చెన్నయ్ రైల్వేస్టేషన్ లో పేలుడు- ఒకరి మృతి

Bomb Blast 

చెన్నయ్: చెన్నయ్ సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం 7 గంటల 30 నిమిషాల ప్రాతంలోఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నయ్ రైల్వే స్టేషన్లోని 9వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న బెంగళూరు- గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్-4 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే స్టేషన్ లో పోలీసులు బాంబు స్వ్కాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు.

అరవైలో ఇరవై (పెళ్లికొడుకుగా డిగ్గీరాజా)..

Digvijaya Singh
ఢిల్లీ : ప్రేమకు ఏజ్ బార్ అడ్డంకి కాదని డిగ్గీరాజా రుజువు చేశారు. వయసెంత ముదిరినా తాను పెళ్లికి రెడీ అంటున్నారు. 67 ఏళ్ల వయసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. టీవీ యాంకర్ అమృతారాయ్ ని పెళ్లాడేందుకు ఆయన సిద్ధమయ్యారు. భార్య చనిపోయి ఏడాది గడవకుండానే ఇప్పుడాయన రెండో పెళ్లికి ముస్తాబవుతున్నాడు. నెట్ లో డిగ్గీరాజా, అమృతారాయ్ ల ప్రేమాయణ ఫొటోలు హల్ చల్ చేయడంతో విమర్శలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి తాము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి దిగ్విజయ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
గాసిప్స్ కి ఫుల్‌ స్టాప్ పెట్టిన డిగ్గీ...
          
అంతకంటే ముందు డిగ్గీరాజా, అమృతారాయ్ ఎఫైర్ ఇంటర్నెట్ లో, రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల సమయంలో ఈ ఫొటోలు బయటకు రావడంతో డిగ్గీ పరువు బజారున పడింది. బీజేపీ దీనిని అస్త్రంగా చేసుకునేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయం కావడంతో విపక్షాల విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని డిగ్గీ భావించారు. విమర్శలకు ఒక్క మాటతో ఫుల్‌ స్టాప్ పెట్టేశారు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాననంటూ తన మనసులోని కోరికను ట్విట్టర్ లో తెలిపాడు. అమృతారాయ్ తో సాన్నిహిత్యం ఉన్న మాట నిజమేనంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకుంటానని ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికి అమృతాయ్ కూడా పెళ్లికి సుముఖత తెలిపినట్లు తెలిసింది. మొత్తం మీద డిగ్గీరాజా పెళ్లిపై వచ్చిన గాసిప్స్ కి ఎట్టకేలకు ఫుల్‌ స్టాప్ పెట్టారు. ఇటు ప్రత్యర్థులుకు అవకాశం ఇవ్వకుండా, పెళ్లికి ఎలాంటి ఇబ్బందీ ఉండకుండా దిగ్విజయ్ వ్యవహరించారని అతని సన్నిహితులు అంటున్నారు

నేడు మేడే..

May Day 10tv.in

హైదరాబాద్: మే 1 (నేడు) మేడే. పెట్టుబడిదారీ వర్గ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం నినదించిన రోజు. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. అది చేస్తున్న నిరంతర శ్రమ. శ్రామికశక్తితోనే మానవ సంస్కృతి వికసించి ముందడుగు వేస్తోంది. కానీ ఆ శ్రమే బండచాకిరీగా మారినపుడు ఏమవుతుంది? శ్రామికుడు దారుణంగా దోపిడీకి గురైనపుడు ఏం జరుగుతుంది? కష్టించే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయ్. భూకంపం సృష్టిస్తాయ్. ఉద్యమాలు పుట్టుకొస్తాయి.
130 ఏళ్ల క్రితమే కార్మికోద్యమం..
పెట్టుబడీదారీ ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ళ క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు జరిగినపుడు చిందిన వెచ్చని నెత్తురే కేతనమై ఎగసింది.
అది అమెరికాలోని చికాగో నగరం..1886 మే 1
    
అమెరికాలోని చికాగోలో కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న రోజులవి. కార్మికులు రోజుకి 18-20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలమది. పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించే వారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలకోసం ఆరేడేళ్ళ పిల్లలతోనూ, మహిళలతనూ ఫ్యాక్టరీల్లో, గనుల్లో పనిచేయించారు. కార్మికులు చాకిరీ కొలిమిలో కుతకుతలాడిపోయిన సందర్భమది.
         ఆ దోపిడీ రాపిడిలోంచి తిరుగుబాటు అగ్గి రాజుకుంది. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికుల 1886 మే 1 ఉద్యమించారు. ఆ రోజు కార్మికవర్గ చైతన్యం వెల్లివిరిసింది. చికాగో నగర వీధుల్లో ఉత్సాహవంతులైన కార్మికుల కదం తొక్కారు. మూడున్నర లక్షలమంది కార్మికులు పోరాటబాట పట్టిన సార్వత్రిక సమ్మె అది. ఆ ఉద్యమం ప్రపంచవ్యాపితమై పెల్లుబికింది. అదే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా ప్రసిద్ధి కెక్కింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గ చైతాన్యాన్ని ఏవిధంగానైనా నాశనం చేయాలని పెట్టుబడిదారి వర్గం నిర్ణయించుకుంది. దానికి ప్రభుత్వం అండగా నిలిచింది.
       అదే ఏడాది మే 3న శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మిక జనసమూహంపై అమెరికన్‌ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా మే 4న హే మార్కెట్‌లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రశాంతంగా సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. మధ్యలో బాంబు ప్రయోగం కూడా జరిగింది. ఒక పోలీసు సార్జెంట్‌ చనిపోయాడు. అది సాకుగా తీసుకుని పోలీసులు నిరాయుధులైన కార్మికులపై తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ సంఘర్షణలో ఏడుగులు పోలీసులు చనిపోగా నలుగురు కార్మికులు నేలకొరిగారు. హే మార్కెట్‌ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. అక్కడే ఆవిర్భవించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాడి శ్రమజీవుల స్వేచ్ఛా సంకేతమైన అరుణపతాకం.
           ఏ దేశంలోనైనా సమాజామార్పునకు చోదక శక్తి కార్మికవర్గమే. మనలాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికులకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలోని ఇతర వర్గాలను కలుపుకుని ఉద్యమాలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ భారతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, ఇతర సమస్యలపై ఉద్యమాలను నిర్మించాల్సి ఉంటుంది. రైతులతో ఇతర వర్గాలతో కార్మికులు భుజం,భుజం కలిపి పోరాడాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకుసాగాలి.

మోడీపై కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు..




అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్ లో ఓటు వేసిన మోడీ..ఎన్నికల గుర్తు కమలం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ ప్రకారం పోలింగ్ బూత్ కు వంద మీటర్ల లోపు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఎన్నికల గుర్తు చూపడంతో పాటు ప్రసంగించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ పేర్కొంది.

తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు- రాఘవులు

bv raghavulu



హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుక్ను ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోని తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని సూచించారు.

Friday 25 April 2014

చంద్రబాబు 'చారిత్రక' ముచ్చట్లు..!


'' మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పు చేశాను...''
- 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు ప్రకటన
'' బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చారిత్రక అవసరం... ''
- 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాజా ప్రకటన
చంద్రబాబు మాటలు నమ్మాలా..? వద్దా..?? ఆయన చెప్పేవి అక్షర సత్యాలా..? జనాన్ని మోసం చేసే అసత్యాలా..??
అనేవి తెలుసుకోవడానికి పై మాటలు చాలవా..?!!
మోడీ-చంద్రబాబు ఓ జట్టట..!
హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ''మా ఇద్దరిదీ ఒక జట్టు'' అన్నారు. నిజమే.. కాదని ఎవరన్నారు..? వీరిద్దరిదీ ఖచ్చితంగా ఒక్కటే జట్టు..! మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందడానికి, గుజరాత్ నమూనా పేరుతో శుద్ధ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రధాని పీఠం దక్కించుకోవడానికి ఆరాటపడుతున్న వ్యక్తి ఒకాయన. ప్రజాసంక్షేమాన్ని నిర్వీర్యం చేసి, రాష్ట్ర విభజన విషయంలో రెండు పాటలు పాడి, ఇప్పుడు.. రెండింటా అధికారం దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న వ్యక్తి మరొకాయన.. వీరిద్దరిలో కామన్ అంశాలు..'' అబద్ధాలు చెప్పడం.. అధికారం కోసం నానాగడ్డి కరవడం..'' మరి.. ఈ విధంగా చూసుకున్నప్పుడు వీరిద్దరిదీ ఒకే జట్టు కాదని ఎలా అనగలం..?!
అవినీతిని తరిమికొట్టే శక్తి మోడీకే ఉందట..!!
అవునా..? మరి.. 2011-12లో రూ. 1,275కోట్లను కార్పొరేట్ కంపెనీలకు గుజరాత్ సర్కారు అప్పనంగా కట్టబెట్టిందని, ఈ నజరానాలు స్వీకరించిన వారిలో ఆదాని, ఎస్ఆర్, లార్సాన్ అండ్ టుబ్రో మొదలైన బడా కంపెనీలున్నాయని, ఈ బాగోతంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తూ కాగ్ బయటపెట్టిన వాస్తవాలన్నీ చంద్రబాబు దృష్టిలో అవాస్తవాలా..?! బహిరంగ మార్కెట్ లో మూడు వేల రూపాయలు పలుకుతున్న చదరపు మీటరు స్థలాన్ని అతి దారుణంగా ఒక్కటంటే ఒకే ఒక్క రూపాయికి ముంద్రాపోర్టుకు, సెజ్ లకు కట్టబెట్టిన వైనాన్ని చంద్రబాబు దృష్టిలో అవినీతి అనరుకాబోలు. బాబు మాటల్లో ''ఇచ్చి పుచ్చుకోవడం అనుకుంటా..''
తెలంగాణకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తడట..!!!
 ఈ పదం విన్న తర్వాత ఒక సందేహం కలుగుతోంది..! చంద్రబాబు దృష్టిలో ప్రజలు మరీ అంత వెర్రివాళ్లలాగా.. ఎప్పటి సంఘటన అప్పుడే, వెంటనే మరిచిపోయే గజినీల్లాగా కనిపిస్తున్నారా..?! అర్థం కావట్లేదు. ఈయన ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన సమయంలో (2000 సంవత్సరం) విద్యుత్ కోసం ఉద్యమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి, భాష్పవాయు గోళాలతో దండెత్తి, వాటర్ కేనన్లు ప్రయోగించి, లాఠీలతో ఉద్యమకారులను కుళ్లబొడిచి, చివరకు.. అత్యంత దారుణంగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించి, ముగ్గురిని బలితీసుకున్నారు. అలాంటి వ్యక్తి .. నేడు అదే విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు.. ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొస్తున్నారు.. అందువల్ల తనను అధికారంలో కూర్చోబెడితే.., మీకు నాణ్యమైన, అవసరమైన, కొరతలేని, కోత లేని విద్యుత్ ఇస్తానంటూ ముచ్చట చెబుతున్నాడు. అంటే.. నాటి విధ్వంసాన్ని చంద్రబాబు గారు మరిచిపోయినట్లుగా.. ప్రజలు కూడా మరిచిపోయి ఉంటారని భావిస్తున్నట్లున్నారు. పాపం హైటెక్ మాజీ ముఖ్యమంత్రి..!
దేశం.. చైనా, అమెరికాలను మించిపోతుందట..!!!
 ''ఆపరేషన్ దుర్యోధన'' సినిమాలో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన హీరో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ''హైదరాబాద్ కు ఓడరేపు తెప్పిస్తానని హామీ ఇస్తున్నా..'' అంటాడు. సభికుల్లోని ఓ వృద్ధుడు స్పందిస్తూ.. ''హైదరాబాద్ లో సముద్రం లేదురా సన్నాసి.. ఓడరేవు ఎలా తెస్తావురా..?'' అంటే.. ''అలాగా.. అయితే హైదరాబాద్ కు సముద్రాన్ని కూడా తెప్పిస్తానని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా..'' అంటాడు. అచ్చం ఇదే విధంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు. భారత దేశం చైనా, అమెరికాలను మించిపోతుందని బాబు చెప్పేశాడు. కానీ.. అది ఎలా సాధ్యం..? ఇప్పటి వరకూ దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ అనుసరించిన విధానాలనే మరింత బలంగా అమలు చేస్తానని మోడీ చెప్తున్నాడు. అంతే తప్ప, కొత్త విధానాలు అమలు చేస్తాననే మాట ఎక్కడా చెప్పట్లేదు. అంటే.. తాను అధికారంలోకి వస్తే.. ఇప్పటి వరకూ దేశ ప్రజలు అనుభవించిన కష్టాలు మరింత రెట్టింపు అవుతాయని మోడీ చెప్పకనే చెప్తున్నాడు. మరి.. అలాంటప్పుడు దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది..? చైనా, అమెరికాలను ఎలా దాటుతుంది..?? ఇది హైటెక్ బాబుకు తెలియదా..? తెలిసి కూడా ఓట్ల కోసం జనాన్ని మోసం చేస్తున్నారా..?? ప్రజలే అర్థం చేసుకోవాలి.

1+1+1 = 111 (అరె బై.. గిదేం లెక్క..?!)

Narendra Modi

హైద్రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. తెలంగాణ ప్రజల నుంచి ఓట్లు రాల్చుకోవడానికి ఆయన పడిన తాపత్రయం మొత్తం ఆయన మాటల్లనే కనపడ్డది.. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని, తెలంగాణ ఏర్పడేదానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి జేసిందని చెప్పుకొచ్చారు. మళ్లీ వెంటనే.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనే తల్లిని చంపేసింది, ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అని మొత్తుకోవడం మొదలు పెట్టారు. అయితే.. తల్లిని చంపేందుకు అవసరమైన కత్తిని అందించింది తామేనని మాత్రం అనకుండా జాగ్రత్తపడ్డారు.. గిట్ల కిరాక్ కిరాక్ గా మాట్లడుతున్న మాటలతోనే సభకు హాజరైన జనాలు బుర్రగోక్కుంటుడగా.. మరో తిక్క'లెక్క' ఒకటి వదిలారు...
1+1+1 = 3 కాదట..! 1+1+1 = 111
 ''మూడు ఒకట్ల మూడు కాదు.. నూట పదకొండు అన్నడు..''! ఇది విన్న జనాల బుర్ర గిర్రుర్రుర్రు...న తిరిగింది. మరోసారి గిదే లెక్క చెప్పిండు.. అర్రే.. ఒకటో తరగతి సదువుతున్న పిల్లగాన్ని అడిగినా.. అమెరికా ప్రెసిడెంటు ఒబామాను అడిగినా.. చివరకు.., సచ్చిపోయి నరకంలో ఉన్నడో, స్వర్గంలో ఉన్నడో.. యాడున్నడో తెల్వదుగానీ.. ఒసామా బిన్ లాడెన్ ను అడిగినా... 1+1+1 = ఎంత..? అంటే '3' అంటరు. కానీ.. గీయనేంది..? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నడు, దేశానికి ప్రధాన మంత్రి అవుతానంటున్నడు.. ఇలాంటాయనకు మూడు ఒకట్లు ఎంతో తెల్వదా..? రామచంద్రా ఇదెక్కడి చోద్యం..?! అంటూ కొంతమంది ముక్కుమీద వేలేసుకోబట్టె.
మాజీ ముఖ్యమంత్రి అంజయ్య దళితుడట..!!
 మోడీజీ.. పైన పేర్కొన్న పైత్యం నుంచి తేరుకోకుండానే మరో అజ్ఞాన బాణం విసిరిండు. తెలంగాణ నేతలను ప్రస్తావించడం ద్వారా.. ఇక్కడి ప్రజలు మనసు గెలుచుకోవాలని భావించిన మోడీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్యను కాంగ్రెస్ నేతలు అవమానించారని, దానికి కారణం.. ఆయన దళితుడు కావడమేనని అనేశారు. ఇది విన్న సభికులంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అంజయ్య.. దళితుడిగా ఎప్పుడు మారాడబ్బా..? అని ఆలోచనలో మునిగిపోయిండ్రు. తెలియనప్పుడు.. తెలియనట్లుండాలిగానీ.. గివేం.. తెలివితక్కువ మాటలు..? అంటూ కొందరు చెవులు కొర్కున్నరు.
ఇదేం మొదటిసారి కాదు...
 తనకు తెలియని విషయాల గురించి మాట్లాడుతూ.. పప్పులో, ఉప్పులో కాలేయడం మోడీ ఇదేం మొదటిసారి కానే కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలా తెలియని విషయల్లో తనకేదో తెలివితేటలున్నట్లు మాట్లాడి అభాసుపాలయ్యారు. పాట్నా ర్యాలీలో ప్రసంగించినప్పుడు బీహారీలకు మస్కా కొట్టాలనే ఆరాటంలో.. ''విశ్వవిజేత అలెగ్జాండర్ ను ఓడించిన ఘనత బీహారీలదే..'' అనేశాడు. అయితే.. ఈ విషయం తెలియని వారు. ఆహా.. ఓహో.. అని చప్పట్లు కొట్టగా.. విద్యావంతులు మాత్రం.. ''నీ తెలివి తగలెయ్య..'' అని నెత్తిబాదుకున్నరు. ఎందుకంటే.. అలెగ్జాండర్ గంగానది దాటి బీహార్ లోకి అడుగు పెట్టనే లేదు. ఈ విషయం తెలియకుండా చప్పట్ల కోసం ఆరాటపడి, నవ్వుల పాలయ్యాడు మోడీ. అదేవిధంగా.. తక్షశిల గొప్పతనాన్ని పొగుడుతూ.. అది బీహార్ లో ఉండడం ఎంతో గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. కానీ.. వాస్తవం ఏంటంటే.. తక్షశిల ప్రస్తుత పాకిస్థాన్ లో ఉంది. ఈ విధంగా తెలియని విషయాల్లోనూ తనకు ఎంతో ప్రజ్ఞ ఉందని చాటుకోవడం కోసం ప్రయత్నించడం.. తప్పులు మాట్లాడడం.. దెబ్బైపోవడం మోడీకి ఒక అలవాటుగా మారింది.
పోల్ సర్వేలన్నీ ఒట్టివే...
 పైన చెప్పుకున్న అన్ని విషయాల్లోనూ తప్పులు మాట్లాడిన మోడీ.. హైదరాబాద్ సభలో ఒక్క నిజం చెప్పారు. అదే.. ఎగ్జిట్ పోల్స్ గురించి. రాజకీయ విశ్లేషకులు ఏసీ గదుల్లో కూర్చొని లెక్కలు వేస్తుంటారని, అవన్నీ చిత్తుకాగితాలతో సమానం అని అన్నారు. ఇప్పటి వరకూ వచ్చిన పోల్ సర్వేలన్నీ నిజాలు కావని, వాటి ఊహకు అందని విధంగా ఫలితాలు వస్తాయని చెప్పారు. అంటే.. బీజేపీకి అధిక సంఖ్యలో సీట్లు వస్తాయని ఊదరగొట్టిన సర్వేలన్నీ వట్టి మాటలేనని మోడీ తేల్చేశారు. కాబట్టి.. మోడీ గాలి వీస్తోందని, బీజేపీ హవా సాగుతోందని చెప్తున్నవన్నీ సొలు కబుర్లేనన్న విషయం నిజమేనని మోడీ ఒప్పేసుకున్నారన్నమాట..!

'తిక్క' ముదిరింది..!

Pawan Kalyan praises Modi 

''దేశ సమగ్రతను దెబ్బ తీసేలా కుల, మత, ప్రాంతీయపరంగా కొందరు మాట్లాడుతున్నారు. వారిని నరేంద్ర మోడీ క్షమించరు.'' - పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
ఈ మాటలు చాలవా.. పవన్ కళ్యాణ్ కు తిక్క ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి..?!
మతాన్ని రెచ్చగొట్టేదెవరో తెలీదా..?
ఈ దేశంలో మతమే ఎజెండాగా ముందుకు సాగుతున్న పార్టీ బీజేపీ అన్న విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారికైనా తెలిసిన విషయం. మరి.. పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియదా..? ఆ మాత్రం అవగాహన లేకుండానే పార్టీ పెట్టేశాడా.?? లేక.. అంతా తెలిసి కూడా, మతోన్మాద పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో.. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా..??? బాబ్రీ మసీదు విధ్వంసం.. గుజరాత్ లో ముస్లింల ఊచకోత.. ముజఫర్ నగర్ హింస.. హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లు.. ఇవన్నీ పవన్ మరిచిపోయినట్లున్నాడు. ఇవన్నీ గత అనుకుంటే.. మొన్నటికి మొన్న మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ''ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలి'' అని రెచ్చగొట్టేలా మాట్లాడడం.. వాటిని పవన్ దృష్టిలో బలమైన నేత అయిన నరేంద్ర మోడీ బలపర్చడం జరిగిపోయాయి. అంటే.. ముస్లింలపై దాడులకు సైతం వెనుకాడబోమని నరేంద్ర మోడీ చెప్పకనే చెప్పారు. మరి.. ఈ సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా..?
'ప్రాంతీయ' పాపంలో బీజేపీకి భాగం లేదా..?
 
పార్టీ ఆవిర్భాయ ప్రసంగంలో రాష్ట్ర విభజన పాపాన్ని ఒక్క కాంగ్రెస్ పై నెట్టేసిన పవన్ కళ్యాణ్.. అందుకు సహకరించిన బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. కానీ.. హైదరాబాద్ లో జరిగిన టిడిపి-బిజెపి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించిందని చెప్పుకొచ్చారు. అంటే.. 'ఏ ఎండకు ఆ గొడుగు' అన్న చందంగా.. ఎక్కడ ఎలాంటి మాటలు అవసరమైతే.. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడుతారనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా..?!
మోడీ మూడు.. సర్కార్ నాలుగు.. అయినా...
 
''గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికై రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. బలమైన ఈ దేశాన్ని పాలించాలంటే.. మోడీ లాంటి బలమైన నేత కావాలి..'' అంటున్నాడు పవన్ కళ్యాణ్. మోడీ భ'జనసేన' అధ్యక్షుడిగా కీర్తి గడించిన ఈయనకు.. మోడీ తప్ప మరెవరూ కనిపిస్తున్నట్టు లేదు. త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఎన్నికలో మోడీ కన్నా ఒక మెట్టు ఎక్కువే ఉన్న సర్కార్.. అవినీతికి ఆమడదూరంలో ఉంటారు. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి. కేవలం నెలకు 5 వేల వేతనంతో బతుకు బండి లాగిస్తున్న నిజమైన ప్రజానాయకుడు. తనదైన లీడర్ షిప్ తో త్రిపురను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఇన్ని క్వాలిటీలు కలిగిన మాణిక్ సర్కార్ కు పవన్ కళ్యాణ్ కళ్లకు ఎందుకు కనిపించట్లేదో..? దీనికి ఆయనే సమాధానం చెప్తే బాగుంటుంది.
దేశ సమగ్రతకు బీజేపీ ఎలా పాటుపడుతుంది..??
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడంలో బీజేపీకి పాత్ర ఉండడమే కాదు.. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే హయాంలోనే జరిగాయి. ఇంకా.. అనేక రాష్ట్రాలను విడదీయాలనే ప్రణాళికను బీజేపీ రూపొందించింది. ''చిన్న రాష్ట్రాలు - బలమైన కేంద్రం'' అన్న నినాదంతో దేశాన్ని అరవై రాష్ట్రాలుగా విభజించాలని ఆ పార్టీ కంకణం కట్టుంది. అలాంటి పార్టీ చేతిలో దేశాన్ని పెడితే దేశ సమగ్రత మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా వెలుగుతుందని తాను నమ్మడమే కాకుండా.. జనులంతా నమ్మండని చెప్తున్న ఈ పవన్ కళ్యాణ్ ను ఏమనాలి..? పై పరిణామాలన్నీ గమనిస్తుంటే.. పవన్ కళ్యాణ్ లెక్కుందని చెప్పుకుంటున్న తిక్కకు లెక్కే లేదని, ఆ తిక్క దారుణంగా ముదిరిపోయిందని అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు..

Thursday 24 April 2014

కటకటాల కేవీపీ..?

KVP Ramachandra
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 'ఆత్మ' బంధువు కేవీపీ అరెస్టుకు అమెరికాలో రంగం సిద్ధమైనట్లు సమాచారం. కేవీపీ అరెస్ట్ విషయమై అమెరికా, భారత్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పీటీఐ వార్తా కథనం ప్రచురించింది. మనీలాండరింగ్ , టైటానియం కుంభకోణంలో కేవీపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఏమిటీ టైటానియం..?
 
టైటానియం అనేది ఒక లోహం.. ఇనుప గనుల్లోంచి ఇనుము తీసినట్లు.. సముద్ర తీర ప్రాంతం నుండి టైటానియం అనే లోహాన్ని తీస్తారు. దీనిని విమానాలు, జలాంతర్గాములు, క్షిపణుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాదు.. కృత్రిమ అవయవాలు, మొబైల్ ఫోన్లు, క్రీడా వస్తువులు, ఆభరణాల తయారీలోనూ టైటానియం ఎక్కువగా ఉపయోగిస్తారు.
రూ.111 కోట్ల ముడుపులు..
అమెరికా 'టైటానియం'ను వ్యూహాత్మక లోహంగా పరిగణించి దీన్ని స్టోర్ చేసుకోవడం ప్రారంభించింది. దీంతో ఈ లోహం విలువ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో.. మన రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల నుండి టైటానియం వెలికితీసేందుకు.. వాటిని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 ఏప్రిల్ 18న 'బెత్లీ' అనే సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విదేశీ కంపెనీల నుండి మన రాష్ట్ర 'పెద్దల' కు రూ.111 కోట్ల ముడుపులు అందాయని... డిఎఫ్ (దిమిత్రి ఫిర్టాష్) గ్రూపు అనుబంధ సంస్థలు ఈ ముడుపులు వీరికి అందజేశాయని.. ఎఫ్ బిఐ తేల్చింది.
ప్రధాన నిందితులు ఆరుగురు...
 
ఈ ముడుపుల భాగోతంలో ప్రధానంగా ఆరుగురు నిందితుల పేర్లను ఎఫ్ బి ఐ బయటపెట్టింది. ఇందులో.. మన రాష్ట్రానికి చెందిన, వైఎస్ ఆత్మ బంధువైన కేవీపీ ఉన్నారు. ఈయనతో పాటు డిఎఫ్ గ్రూపు కంపెనీల అధినేత దిమిత్రి ఫిర్టాష్, హంగేరీకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రాస్ నోప్, అమెరికాలో స్థిరపడిన భారతీయుడు గజేంద్రలాల్, శ్రీలంకకు చెందిన పెరియస్వామి, ముడుపుల సమన్వయ కర్తగా వ్యవహరించిన సురెన్ జెవోర్జియాన్ పేర్లను ప్రధానంగా పేర్కొంది. వీరితో పాటు.. ఎపిఎండిసి ఎండి రాజగోపాల్ , మిస్టర్ 'సి' ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ మిస్టర్ 'సి' ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.
కేవీపీ విషయంలో స్పందించని ప్రభుత్వం..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉక్రెయిన్ వ్యాపారవేత్తను ఆ దేశ ప్రభుత్వం మార్చి 12, 2014న అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన రూ.1000 కోట్ల పూచీకత్తుపై విడుదల కావాల్సి వచ్చింది. కానీ మనదేశ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో సరిగ్గా స్పందించలేదు. టైటానియం కుంభకోణానికి సంబంధించిన నిందితులలో రాజ్యసభ ఎంపి కేవీపీ ఉన్నప్పటికీ ఈ ఘటనపై విచారణ జరిపే ప్రయత్నం కూడా చేయలే
దు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విచారణ పూర్తిచేసి.. కేవీపీ అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

జేపీ మావాడే : మోడీ.. నా మద్దతు మోడీకే : జేపీ

Jayaprakash Narayan and Modi 
సరిగ్గా పదిరోజుల క్రితం లోక్ సత్తా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ వీడియో ఒకటి మీడియాలో హల్ చల్ చేసింది. కొందరు కార్పొరేట్ ప్రతినిధులతో 35 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుతున్న కేజ్రీవాల్.. ఓ జాతీయ ఛానెల్ చేసిన 'స్టింగ్ ఆపరేషన్' లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తప్పనిసరి పరిస్థితుల్లో.. కేజ్రీవాల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే.. తమ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టిన మీడియాపై జేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనురాగ్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీడియాలోని ఒక వర్గం తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు.
జేపీ తనమనిషన్న మోడీ.. మోడీకే మద్దతన్న జేపీ..
 
సీన్ కట్ చేస్తే.. స్టింగ్ ఆపరేషన్ లో అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన ప్రతి మాటా నిజమేనని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు మోడీ, జేపీ తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా చూపుతున్నారు. 'మీరు నా మనిషి. మీ అవసరం దేశానికి చాలా ఉంది. దేశంలో సంస్కరణలను అమలు చేయాలంటే మీలాంటి వారు లోక్ సభలో ఉండాలి'. అని.. లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను ఉద్దేశించి.. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మరోవైపు జేపీ కూడా.. మోడీకే తన పూర్తి మద్దతు అని, భావి ప్రధాని మోడీనే అని చెబుతున్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని పొగిడేశారు.
అంటే.. అనురాగ్ మాటలన్నీ వాస్తవమేనా..?
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే అందులో జేపీ మంత్రి పదవి దక్కించుకోవడం ఖాయమని, ఆయన శాఖలో మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతామని, దానికోసం ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కింద రూ.35 కోట్లు ఇవ్వాలని కార్పొరేట్ ప్రతినిధులతో డీల్ సందర్భంగా అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన ప్రతిమాటా నిజమేననే ఊహాగానాలకు ప్రస్తుత పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయి. జేపీ, మోడీ ఒకరినొకరు పొగుడుకోవడం ఇందులో భాగమేనని పలువురు పేర్కొంటున్నారు.
ఇంతకీ.. సంస్కరణలు ఎవరికోసం..?
 
నరేంద్ర మోడీ మాటల్లో దేశంలో విస్తృతమైన సంస్కరణలు రావాలని.. వాటిని అమలు చేయాలంటే జేపీ లాంటి వారు లోక్ సభలో ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ సంస్కరణలు ఎవరి కోసం..? ప్రజల, ప్రభుత్వ ఆస్తులు దోచుకుని వేల కోట్ల రూపాయల లాభాలు వెనకేసుకునే కార్పొరేట్ల కోసమా..?? లేక సాధారణ ప్రజానీకం కోసమా..!? దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ధనవంతులు రోజురోజుకూ ఆస్తులు కూటగట్టుకుంటుంటే.. పేదలు మరింత పేదలుగా దిగజారిపోతున్నారు. ఇప్పుడు జేపీ లోక్ సభలో పాగావేసి ఇవే సంస్కరణలను మరింత పటిష్టంగా అమలు చేయాలని మోడీ కోరుతున్నారు. దీనికి జేపీ కూడా తన అంగీకారం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. జయప్రకాష్ నారాయణ చెప్పే నీతి వాక్యాలన్నీ ప్రజలను, యువతను బుట్టలో వేసుకోవడానికే తప్ప, ఆయన మాటల్లో నిజాయితీ లేదనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు.