Saturday 1 March 2014

పొలిటికల్ క్యాంటీన్.. (ఇడ్లీ, పాలు, చాయ్ తో నేతలు రెడీ..!)



రండిబాబూ రండి.. రూపాయికే ఇడ్లీ.. మూడు రూపాయలకే పెరుగన్నం. ఫ్రీగా పాలు, చాయ్ అంటూ.. రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు గాలం వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రకరకాల హామీలను ఇవ్వడంతోపాటు.. వారికి క్యాంటీన్ సౌకర్యం కూడా కలిపిస్తున్నారు. అయితే ఇది కేవలం ఎన్నికల వరకే లేండి.
క్యాంటిన్ బిజినెస్ లో ముందున్న జయలలిత..
       
క్యాంటీన్ నడపడంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందరికంటే ముందున్నారు. గత ఏడాది నుండే.. ఆమె క్యాంటీన్ నిర్వహణలో బిజీ అయ్యారు. రూపాయకే ఇడ్లీ అందిస్తూ..తమిళ తంబీలను ఆకట్టుకున్నారు. తక్కువ బడ్జెట్ లోనే టిఫిన్ దొరకడంతో.. జయ ఇడ్లీలకు మార్కెట్ లో బాగానే డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రూపాయలకే పెరుగన్నం అంటూ తన క్యాంటీన్ బిజినెస్ ను ఆమె విస్తరించారు. అంతేకాదండోయ్.. మధ్యాహ్నం వేళలో ఐదురూపాయలకే సాంబార్ అన్నం కూడా ఇక్కడ లభిస్తుంది. ఎంతైనా చెన్నై వాళ్లకు సాంబార్ అంటే ప్రాణం కదా..! దాన్నే జయ తన బిజినెస్ కోసం .. అదేనండీ పొలిటికల్ బిజినెస్ కోసం వాడేసుకున్నారు. తొలిదశలోనే జయమ్మ 200 క్యాంటీన్లు ప్రారంభించిందంటే.. ఈ బిజినెస్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు.

'చాయ్ వాలా' గా మోడీ..        ఇక గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 'చాయ్ వాలా' గా మారి ఓట్లకోసం 'చాయ్' అమ్ముకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో 'మోడీ చాయ్' పేరుతో.. తన 'టీ' రుచిని అందరికీ పరిచయం చేస్తున్నారు. అంతేకాదు...See More 

No comments:

Post a Comment