Saturday 1 March 2014

టీమిండియా పరాభవానికి ముఖ్యంగా నిందించాల్సింది వారినే ..!



విదేశీ గడ్డపై మరో పరాభవం... సఫారీ గడ్డపై ఘోర పరాజయం మరువక ముందే.. కివీస్ గడ్డపైనా కనీసం ఒక్క విజయమైనా లేకుండా టీం ఇండియా వెనక్కు తిరిగింది. 2011 ప్రపపంచకప్ గెలిచిన జట్టు ఇదేనా..? అన్న అనుమానాలు తలెత్తేలా భారత ఆట తీరు రోజురోజుకూ దిగ జారుతోంది. టీం ఇండియా వరుస ఓటములకు ఆటగాళ్లది బాధ్యత అన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నా...అసలు బాధ్యత వహించాల్సింది మాత్రం భారత క్రికెట్ బోర్డు...యువ భారత్ లో జోరేదీ...       సచిన్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్,కుంబ్లే, హర్భజన్,జహీర్ ...కొన్నేళ్ల పాటు ప్రత్యర్థులకు వెన్నులో చలిపుట్టేట్టు రాణించారు. వీరి కనుసన్నల్లో ధోనీ, గంభీర్, రైనా, కోహ్లీ, రోహిత్, ఇషాంత్, అశ్విన్ ఎదిగారు. దిగ్గజాల్లో సచిన్, ద్రావిడ్, గంగూలీ రిటైర్ కాగా... మిగతా వారు ఫాం లేమితో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో యువతరం తో కూడిన జట్టు తెరమీతకు వచ్చింది. గత ఏడాది సచిన్ సైతం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అటు టెస్టు, ఇటు వన్డే క్రికెట్ లోనూ యువకులతో కూడిన జట్టు తయారైంది. అయితే ఈ యువ భారత్ జట్టు వన్డేల్లో ఒక మోస్తారుగా రాణించింది. టెస్టుల్లో మాత్రం ఆపసోపాలు పడుతోంది. ఇక విదేశీ గడ్డపై టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ చతికిలపడుతోంది. దిగ్గజాల కనుసన్నల్లో ఎదిగిన కోహ్లీ, ధోనీ మాత్రమే భారత జట్టుకు అండగా నిలుస్తున్నారు. గంభీర్ జట్టులో చోటు కోల్పోగా, రైనా, రోహిత్, ఇషాంత్, అశ్విన్ జట్టులో చోటు నిలుపుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. కొత్త ఆటగాళ్లు ఛటేశ్వర పుజారా, అజింక్య రహానే, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ అడపదడపా రాణిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో టీం ఇండియాకు భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారు.తప్పెవరిది...?స్వదేశంలో ఫర్వాలేదనిపిస్తున్నా...విదేశాల్లో మాత్రం యువ భారత్ బోల్తా పడుతోంది. దీనికి బాధ్యత ఎవరిది....? అందరి దృష్టి ఆటగాళ్ల పైనే పడుతోంది. జట్టులో ఉన్న ఆటగాళ్లు సరిగా ఆడకపోవడమే వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లను కానీ, బోర్డును కానీ ఎవరూ ఏమీ అనే సాహసం చేయడం లేదు. అసలు భారత క్రికెట్ బోర్డు చేస్తున్న తప్పిదాలు మాజీ ఆటగాళ్లకూ కనిపించడం లేదు. డబ్బే లక్ష్యంగా పని చేస్తోన్న బిసిసిఐ మితిమీరిన క్రికెట్ ఆడిస్తోంది. పొట్టి క్రికెట్(T-ట్వంటీ) మొదలయ్యాక ఏడాదిలో ఆడే మ్యాచ్ ల సంఖ్య భారీగా పెరిగింది. రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు అవకాశం కల్పించకుండా మన క్రికెట్ బోర్డు కొంతమంది ఆటగాళ్లతోనే నెట్టుకు వస్తోంది. భారీగా టోర్నీల సంఖ్య పెరగడంతో ఆటగాళ్లు అలిసి పోతున్నారు. మరో వైపు టోర్నీకి టోర్నీకి మధ్య గ్యాప్ ఎక్కువగా లేకపోవడంతో కొత్త సిరీస్ కు సన్నద్ధం అవడానికి ఆటగాళ్లకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం విదేశీ గడ్డపై ఘోర పరాభవాలకు ఇదే కారణంగా కనిపిస్తోంది. గత రెండు విదేశీ సిరీస్ లను పరిశీలిస్తే... దక్షిణాఫ్రికా గడ్డపై ఘోర పరాభవానికి, కీవిస్ లో ఓటమికి కారణం ముందస్తు ప్రాక్టీసు లేకపోవడమే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు విదేశాల్లో ఆడాలంటే 15 రోజుల ముందుగానే ఆదేశం వెళ్లి ప్రాక్టీస్ చేసి అక్కడి వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తాయి. మన జట్టు మాత్రం రెండు రోజుల ముందు వెళ్లి ప్రాక్టీసు లేకుండానే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం మొదలు పెడుతోంది. కాసుల వేటలో ఉన్న బిసిసిఐ విదేశీ గడ్డపై ఆడే సిరీస్ షెడ్యూలు ను ఆటగాళ్లకు అనుకూలంగా లేకుండా తయారు చేస్తోంది. ఇక రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ దీర్ఘ కాలిక అవసరాలను చూడటంలోనూ క్రికెట్ బోర్డు విఫలమవుతోంది. ఒక్కసారే కొందరూ See more 

No comments:

Post a Comment