Saturday 1 March 2014

రాష్ట్రాలు రెండైనా.. ప్రజలు పోరాడాల్సిందే : రాఘవులు


jcrop-preview

రాష్ట్రాలు రెండైనా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంపై రాఘవులు 'టెన్ టివి'తో మాట్లాడారు. ఆ వివరాలు...
టెన్ టివి: సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు, ఆమోదించిన తీరును మీరు ఎలా విశ్లేషిస్తారు..?
రాఘవులు : గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రకటన చేయడం, వెనక్కి పోవడం, మళ్ళీ ప్రకటన చేయడం, వెనక్కి పోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీలోనే అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకోవడం, రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకించడం జరిగాయి. పార్లమెంటులో రభస చేసే వారిలో కాంగ్రెస్ వారే ముందున్నారు. కాంగ్రెస్ పార్టీయే తమ పార్టీ వారిని సస్పెండ్ చేయడం, కాంగ్రెస్ మంత్రులే స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయారు. మొత్తంగా కాంగ్రెస్ జుగుప్సాకరమైన పరిస్థితి సృష్టించింది. ఈ చేష్టలు ఎవ్వరూ అంగీకరించేవి కావు. దురదృష్టమేమిటంటే ఇవన్నీ సాంకేతిక విషయాలైపోయాయి. రాష్ట్ర విభనకు కాంగ్రెస్, బిజెపి అంగీకరించిన తర్వాత.. దీనిపై చేసే నిరసనలకు విలువ లేకుండా పోయింది.See more 

No comments:

Post a Comment