Saturday 1 March 2014

టి.బిల్లు గెలుస్తుందా..? ఓడుతుందా..??




నేడే పార్లమెంటులో టి.బిల్లుపై చర్చ..!
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు..!!
సభ సజావుగా సాగుతుందా..? రచ్చ రచ్చ అవుతుందా..?!
ఫైనల్ గా.. తెలంగాణ బిల్లు ఓడుతుందా..? గెలుస్తుందా..??



ఆమోదానికే కాంగ్రెస్ కసరత్తు...
             
రాబోయే ఎన్నికల్లో లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కాంగ్రెస్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లోనే టి.బిల్లును ఆమోదించాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి నేతలతో ఏకంగా ప్రధాన మంత్రి విందు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇతర బిల్లులు అన్నింటినీ పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రధానంగా టి.బిల్లుపైనే దృష్టి కేంద్రీకరించింది. ఏది ఏమైనా ఈ రోజు బిల్లును ఆమోదించాలనే కృత నిశ్చయంతో ఆ పార్టీ ఉంది.

గోడమీద పిల్లి వాటాన్ని అవలంభిస్తున్న బిజెపి...         మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని ముక్త కంఠంతో చెబుతూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు గొంతు సవరిస్తున్నారు. విభజనపై తలో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతిచ్చేది లేదని పార్టీ సీనియర్ నేత అద్వానీ అంటుంటే.. విభజనకు తాము కట్టుబడ్డామని అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెబుతున్నారు. సుష్మా స్వరాజ్ పూటకో మాట మాట్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ నేతలు మాత్రం బిజెపి తప్పకుండా విభజనకు మద్దతు ఇస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా...See more 

No comments:

Post a Comment