Friday 14 March 2014

పవన్ పంచ్ డైలాగ్స్..


pawan kalyan
హైదరాబాద్: జనసేన పార్టీ ఆవిర్భావ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్స్ ఇలా..
సామాన్యుల సేన.. జనసేన..
కాంగ్రెస్ పార్టీ గంగానదా..
జైరాం రమేష్ మరో మౌంట్ బాటన్..
నేను ఆంధ్రోన్ని కాదు..భారతీయున్ని..
భగత్ సింగ్ జీవితం స్పూర్తి దాయకం..
కవితమ్మా.. తెలంగాణ జాగృతి విరాళాల లెక్కలు చెప్పమ్మా..
చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కారాదు..
రాహుల్ బ్రహ్మచారే కానీ..
తెలంగాణలో జగ్గారెడ్డే అసలైన నాయకుడు..
కేసీఆర్ ను తప్పుపట్టడం సరికాదు..
నాకు సిఎం పదవి తుఛ్చమైనది..
స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తాటతీస్తా...
పాల్కుర్కి గొప్పా.. నన్నయ్య గొప్పా అంటే ఏం చెబుతాం..
ప్రాంతాలుగా విడిపోయాం.. సోదర భావంతో మెలుగుదాం..
విభజన విషయంలో.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా..
వ్యక్తిగత విమర్శలుకు దిగితే.. మీ భాగోతాలు బయటపెడుతా..
అప్పటి సిపిఎఫ్ ఇప్పటి జనసేన పార్టీ..
మీరు నన్ను తిట్టే కన్నా.. ఢిల్లీ వాళ్లని తిట్టండి..
నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు..
అలాగే సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింటే చూస్తూ ఊరుకోను..
ప్రజాధనం లూఠీ చేస్తే .. తాట తీస్తా..
పేపర్, ఛానల్ కోసం పార్టీ ఏర్పాటు చేయలేదు..
అల్లుడు, అబ్బాయ్ ల భాగోతం యూట్యూబ్ లో విడుదల చేస్తా..
నాది బాంచన్ నీ కాల్మొక్తా అనే మనస్తత్వం కాదు..
అన్నయ్యను ఎదురు నిలబడేందుకు కారణం కాంగ్రెస్సే..
కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో..

కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో : పవన్

pawan kalyan at party announcement.

భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తూ... దేశాన్నే సర్వ నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతను నాశనం చేస్తున్నాయని విమర్శించారు...
రాష్ట్ర విభజనకు పాలకులే కారణం...
 
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడానికి దశాబ్దాల తరబడి పాలించిన పాలకులే కారణమని పవన్ కళ్యాణ్వి మర్శించారు. సమస్య ను మొగ్గలోనే తుంచకుండా తమ అవసరాలకోసం వాడుకున్నారని అన్నారు. ఫలితంగానే అది ముదిరి నేడు రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కారణమైందని చెప్పారు. దీనికి పూర్తిగా రాష్ట్రాన్ని పాలించిన వారే బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
విభజనతో దేశ సమగ్రతకు భంగం...
 
ప్రాంతాల వారీగా జరిగే విభజనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే అయితే.. 2009లోనే ఎందుకు రాష్ట్రాన్ని విభజించలేదని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కాలయాపన చేసి, పార్లమెంట్ చివరి సెషన్ లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో ఎందుకు విభజించాల్సి వచ్చిందని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
నేను భారతీయున్ని...
 
తాను భారతీయున్నని, తనకు కులం, మతం, ప్రాంతం లేవని పవన్ చెప్పారు. తనను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తినని అంటే బాధగా ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసినప్పటికీ.. ప్రజల్ని మాత్రం విడదీయొద్దని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర ప్రాంతంపై విద్వేషాలు పెంచడం సరికాదని, తెలంగాణ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన వారు.. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో.. తెలంగాణలోని రైతులందరికీ చెప్పాలని, అప్పుడు అందరూ అభివృద్ధి చెందుతారని పరోక్షంగా కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రజల మధ్య ద్వేషం పెంచే ప్రయత్నం...
 
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జరుగుతోందని పవన్ అన్నారు. ఇందుకోసం కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ పద్ధతిని విరమించుకోవాలని హెచ్చరించారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య సుహృద్భావం పెంచేందుకు జనసేన పాటుపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి.. ప్రజలుగా కలిసుండాలని, రెండు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ దిశగా జనసేన కృషి చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ వల్లే అన్నయ్యకు ఎదురుగా...
 
అన్నయ్య చిరంజీవికి తాను ఎదురుగా నిలబడడం లేదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలోనే.. తప్పక ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అన్నయ్య అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు.
మూడోపెళ్లి నా వ్యక్తిగతం..
 
తన మూడో పెళ్లి గురించి పవన్ మాట్లాడుతూ... ...see more..

అన్యాయాన్ని ప్రశ్నించేందుకే- పవన్

pawan kayan 
హైదరాబాద్: ఎంతో అంతర్మధనం చేసిన తరువాతే తాను జనసేనను స్ధాపించాలని నిర్ణయించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండు దశాబ్ధాల వేదన తరువాత తాను ప్రజలకు, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. ఈ నిర్ణయానికి కట్టుబడి అన్నీ కోల్పోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పారు.   

సామాజిక సృహ అప్పటినుంచే- పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్: తాను 7 వ తరగతి చదువుతున్నపుడు చూసిన ఘటన వల్లే తనలో సామాజిక స్పృ హ పెరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్యుడు ఏవిధంగా బాధపడుతాడో తనకు ఆరోజే తెలిసిందని చెప్పారు. లోకంలోని మనుషులంతా మనసులో ఒక మాట నోటి నుంచి ఒక మాట మాట్లాడుతారని అన్నారు. సమాజంలో సామాన్యులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీవితంలో ప్రతీ చోట తనకు సమస్యలే కనిపించేవని అన్నారు. తనలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు విప్లవ సాహిత్యం, తెలంగాణ సాయుధపోరాటం గురించి చదివానని చెప్పారు. తనలో తిరుగుబాటు తత్వం ఎప్పటికీ పోదని అన్నారు. సమాజంపై కోపంతో మార్షల్ ఆర్ట్స్ , యోగ నేర్చుకున్నానని అప్పటికీ తన మదిలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం లభించేది కాదని, నిరాశ, నిశ్పృహతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించానని చెప్పారు. తన జీవితంలో ప్రవేశించిన అమ్మాయిలు తన మనసు మార్చారని అన్నారు.సమాజం పట్ల, దేశం పట్ల పోరాటం చేయాలని తాను వేసుకున్న ప్రశ్నే తనను ప్రజల ముందు నిలబెట్టిందని అన్నారు.

దేశ సమగ్రత కోసం ప్రాణాలు సైతం అర్పిస్తా- పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్: దేశ సమగ్రతను కాపడేందుకు తాను ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజం కోసం ప్రశ్నించేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారి తాట తీస్తానని హెచ్చరించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు బలిపీఠమెక్కే మొదటి వ్యకి తానే అవుతానని చెప్పారు.

కాంగ్రెస్ తో తప్ప.. పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్: జనసేన పార్టీ కాంగ్రెస్ తో తప్ప ఏపార్టీతోనైనా కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. టిడిపి తోనూ కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలలో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలలో సుస్ధిరతను సాధించేందుకు జనసేన కృషిచేస్తుందని చెప్పారు.

'ఎన్నికల' కోసమే 'విభజన' - పవన్




హైదరాబాద్ : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఢిల్లీ పెద్దలు.. ఇప్పుడు విభజన నిర్ణయం తీసుకున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే.. 2009లోనే ఇచ్చిఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. అలా చేసిఉంటే.. 1000 మంది యువకులు ఆత్మహత్య చేసుకునే వారు కాదని తెలిపారు. సోనియా, రాహుల్ పద్దతి ప్రకారం ఇరు ప్రాంతాల వారితో మాట్లాడి ఉండాల్సిందన్నారు. విభజన విషయంలో అధిష్టానం స్వార్థ పూరితంగా వ్యవహరించిందని, కేవలం 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేసిందని చెప్పారు. తెలుగు వారికి ఢిల్లీ నేతలు ఎప్పుడూ విలువ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాల పరిరక్షణకే జనసేన పుట్టింది - పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ : చట్టాలు అందరికీ సమానంగా అమలయ్యేలా చూసేందుకే జనసేన పార్టీ పుట్టిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. నైతిక విలువలు కాపాడే యువనాయకుల కోసం వెతుకున్నానని, జనసేన పార్టీ సిద్ధాంతాలు కాపాడే ప్రతి ఒక్కరినీ ఈ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించడానికి.. పత్రికలు, టీవీలు స్థాపించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు అంతకంటే రాలేదన్నారు. అన్ని సౌకర్యాలూ ఒక్కరే పొందాలని అనుకున్నప్పుడే దేశంలో జాతి వైరుధ్యాలు, వైషమ్యాలు వస్తాయని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం కానీ.. అదెప్పుడు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. ప్రస్తుతం తమ పార్టీ నిర్మాణ దశలో ఉందన్నారు. 

'ఆంధ్రోడు' అంటే బాధగా ఉంది - పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ : తనను 'ఆంధ్రోడు' అంటే చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేదని.. తాను భారతీయుడినని పేర్కొన్నారు. అలాగే తనకు కులం, మతం అనే తేడా కూడా లేదని స్పష్టం చేశారు. భాష కన్నా భావం ముఖ్యమని.. గురజాడ, శ్రీశ్రీ ల్లో ఎవరు గొప్ప అనే పరిస్థితి రాకూడదని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసినా.. ప్రజల్ని విడదీస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెసిఆర్ మాటలు ఫ్యూడల్ దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులందరికీ అదే విధానాన్ని నేర్పాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించాలన్నారు

కవితా.. ముందు మీ లెక్కలు చెప్పండి - పవన్

Pawan Kalyan
హైదరాబాద్ : తనను విమర్శించే ముందు.. తెలంగాణ జాగృతికి వచ్చిన విరాళాల లెక్కలు ప్రజలకు చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తనకు కవిత చెల్లెలు లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలనే విషయానికి, కెసిఆర్ కుటుంబానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.  

విభజన పాపం నేతలదే - పవన్

pawan kalyan 10tv

హైదరాబాద్ : రాష్ట్రాన్ని పాలించిన నేతలంతా విభజనకు బాధ్యత వహించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రాష్ట్ర విభజన పాపం నేతలందరిదనీ ఆయన పేర్కొన్నారు. నేతలకు.. డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ దేశంపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం జరిగి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజకీయ నాయకుల పాపం వల్లే ఇరు ప్రాంతాల సామాన్యులు కొట్టుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితికి కారణమైన నేతలంతా బయట మాత్రం కలిసి మెలిసే తిరుగుతున్నారని పేర్కొన్నారు.   

నేను భగత్ సింగ్ వారసుడిని - పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ :  తాను భగత్ సింగ్ వారసుడినని, ఆయన స్ఫూర్తితో అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించేందుకు పోరాటం చేస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు తన ప్రాణాలు కూడా లెక్కచేయని ఆనాటి విప్లవ వీరుడు భగత్ సింగ్ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. 20 ఏళ్ల వయసులో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.    

బానిసను కాను - పవన్

Pawan Kalyan
హైదరాబాద్ : తనది బానిస మనస్థత్వం కాదని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నోవాటెల్ హోటెల్ లో జనసేన పార్టీని ప్రకటించే సమయంలో ఆయన మాట్లాడుతూ... బాంచన్ దొర అని కాళ్లు పట్టుకునే అలవాటు తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న వారి కాల్లు మొక్కడం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.   

విభజన తీరు నచ్చలేదు : పవన్ కళ్యాణ్

pawan kalyan 10tv
హైదరాబాద్ : రాష్ర్ట విభజన తీరు తనకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ర్ట విభజన విషయంలో బిజెపి నేత వెంకయ్య నాయుడు సీమాంధ్ర ప్రజల కోసం చేసిన ప్రయత్నం తనకు నచ్చిందన్నారు. అందుకే వెంకయ్యనాయుడు అంటే తనకు చాలా ఇష్టమని ప్రసంశించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అడుగుతుంటే కేంద్ర మంత్రి జయరాం రమేశ్ కొసరి కొసరి కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని నాయకులతో తనకు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయని అయితే... వారంటే తనకు ఎలాంటి అయిష్టం లేదని తెలిపారు. వారి సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని వివరించారు. వారి సిద్ధాంతాలతో తాను ఏకీభవించలేనన్నారు. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపారు. 

వ్యక్తిగత' విమర్శలు వద్దు - పవన్

Pawan Kalyan
Pawan kalyan www.10tv.in
హైదరాబాద్ : '' రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తే నేను భయపడను. పిరికితనం అంటే నాకు చిరాకు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ వెన్నుచూపను'' అని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు. తాను రాజకీయ పార్టీ పెడుతున్నానంటే అనేక మంది రకరకాల విమర్శలు చేశారని తెలిపారు. పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో కలపాలని దిగ్విజయ్ కోరినట్లు చెప్పారు. అలా కలిపేందుకు కాంగ్రెస్ ఏమైనా గంగానదా..? అని ప్రశ్నించారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఇటీవల వార్తలొస్తుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గంగిరెద్దుల మాదిరిగా కొత్త దుకాణం పెడుతున్నారని చేసిన కామెంట్ కు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

నాటి సీపీఎఫ్.. నేటి జనసేన – పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ : సీపీఎఫ్(కామన్ మేన్ ప్రొటక్షన్ ఫోర్స్) ఆగలేదని.. నాటి సీపీఎఫ్ నేటి జనసేన గా మారిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నోవాటెల్ లో ఆయన మాట్లాడుతూ.. '' నీకు దేశం ముఖ్యమా..? ప్రాణం ముఖ్యమా..? అంటే దేశమే ముఖ్యం అంటాను'' అని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం తన మిత్రులకు ఇష్టం లేదని.. వారితో గొడవ పెట్టుకుని వచ్చేశానని తెలిపారు.

నా పార్టీ పేరు 'జనసేన' : పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan kalyan www.10tv.in
హైదరాబాద్ : తన పార్టీకి 'జనసేన' అని పేరు పెట్టినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు వేలాది మంది అభిమానుల మధ్య, నోవాటెల్ లో ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. తనకు పదవుల మీద ఆసక్తి లేదని.. మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులపై కోరిక లేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితిని చూస్తే విసుగొచ్చిందని.. నేతల మీద అసహ్యం వేసిందని అందుకే ఒక నిర్ధిష్టమైన ఆలోచనా విధానం తోటి, సుదీర్ఘమైన లక్ష్యంతోటి ముందుకు వచ్చానని చెప్పారు.

కాంగ్రెస్ వల్లే అన్నయ్యకు ఎదురు నిలిచా - పవన్

Pawan Kalyan
Pawan kalyan www.10tv.in
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే ప్రస్తుతం అన్నయ్యకు ఎదురు నిలిచానని, అన్నయ్యపై వ్యక్తిగతంగా తనకెలాంటి కోపం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. శుక్రవారం నాడు నోవాటెల్ లో జనసేన పార్టీని ప్రకటించిన ఆయన మాట్లాడుతూ.. ఇదంతా 'హై కమాండ్' తప్పే నని పేర్కొన్నారు. అన్యాయాలకు అక్రమాలకు ఎదురు నిలబడాలనే ఆలోచన తనకు లేదని.. కానీ, ఆ పరిస్థితిని ఢిల్లీలోని పెద్దలు కల్పించారని పేర్కొన్నారు. సినిమాలు చేసుకుంటూ ప్రజలకు ఆనందం కల్పించాలనుకునే తనను ఇలా రాజకీయాల్లోకి వచ్చేలా చేశారని తెలిపారు.

నోవాటెల్ కు చేరుకున్న పవన్...

Pawan Kalyan
pawan kalayan www.10tv.in


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్ కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరోవైపు ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న సభలో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ‘జన సేన’ విధి విధానాలను స్వయంగా ప్రకటించనున్న విషయం తెలిసిందే.........

Wednesday 5 March 2014

ఫేస్ బుక్ 'లైవ్ చాట్' కు డుమ్మా కొట్టిన మోడీ..! (కారణం అదేనట..!?)


http://www.10tv.in/news/national/Narendra-modi-not-attends-to-Facebook-Live-Chat-32359
సోషల్ మీడియాను పెద్ద మొత్తంలో వినియోగిస్తున్న రాజకీయ నేతల్లో నరేంద్ర మోడీ ముందుంటారని ఓ ప్రచారం.. ఈ పనికోసం ఆయన వద్ద పెద్ద సంఖ్యలో ఐటీ నిపుణులు సైతం పనిచేస్తుంటారని మరో సమాచారం.. మరి.. ఈ విషయాలు తెలుసుకున్నారో..? ఏమో..? తెలియదుగానీ.., భారత్ లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా 'ఫేస్ బుక్' సంస్థవారు ప్రారంభించిన ''లైవ్ చాట్'' కార్యక్రమాన్ని మోడీతో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం 'మార్చి 3'గా నిర్ణయించారు. ఈ విషయాన్ని మూడు నెలలు ముందుగానే మోడీకి తెలియజేశారు. దీనికి 'తప్పకుండా వస్తా..' అని మోడీ హామీ ఇచ్చారు. మార్చి మూడో తారీఖు రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఇక లైవ్ చాట్ ప్రారంభం కాబోతోందని భావిస్తున్న తరుణంలో 'ఫేస్ బుక్' సంస్థకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ''లైవ్ చాట్ కార్యక్రమానికి మోడీ రావట్లేదు..'' అని దాని సారాంశం. దీంతో.. ఏం చేయాలో అర్థంకాని నిర్వాహకులు ''ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది.. దీనికి ఎంతగానో చింతిస్తున్నాం..'' అంటూ మోడీ కోసం ప్రశ్నలు పంపిన వారికి మెసేజ్ చేశారు. అయితే.. ఇదంతా మొన్న జరిగిపోయిన, అందరికీ తెలిసిన విషయం. కానీ.. ఇందుకు గల కారణాలు ఏంటనేది చాలా మందికి తెలియని అంశం..!
అదేమంటే..?
     
ఫేస్ బుక్ 'లైవ్ చాట్'లో పాల్గొంటానని రెండు నెలల ముందే మోడీ నిర్వాహకులకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆఖరి నిమిషంలో మాత్రం మొహం చాటేశారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే.. ఇప్పటి వరకూ 'లైవ్' లో ప్రజలు అడిగే ప్రశ్నలకు మోడీ నేరుగా సమాధానం ఇవ్వలేదు. నిజానికి మోడీ తన ప్రచారానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ.. కొన్ని కార్పొరేట్ సంస్థల నిర్ణయాన్ని శిరసావహిస్తారని ప్రచారం సాగుతోంది. ఎప్పుడు, ఎక్కడ సభలు పెట్టాలో..? ఆ సభల్లో ఏం మాట్లాడాలో..?? మొత్తం స్క్రిప్టు తయారు చేసేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉంటాయట! ఆ స్క్రిప్టు ప్రకారమే మోడీ మాట్లాడుతారట!! అలాంటి మోడీ.. ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొంటే.. ప్రజలు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా మోడీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది గుజరాత్ అభివృద్ధి కావొచ్చు, బిజెపి ఆర్థిక విధానాలు కావొచ్చు లేదా మతకలహాలకు సంబంధించినవి కావొచ్చు. ఇలా.. నేరుగా ప్రజలు సంధించే బాణాల్లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మోడీ భయపడ్డారని, అందుకే.. 'లైవ్ చాట్' కు దూరమయ్యారని ప్రచారం సాగుతోంది.
సిద్ధంగా వేలాది ప్రశ్నలు.. ముందుగానే చెప్పాలన్న మోడీ..!
     
ఫేస్ బుక్ 'లైవ్ చాట్' లో మోడీ పాల్గొంటున్నారనే ప్రచారం మొదలైన నాటి నుండి మార్చి 3 వరకు కొన్ని వేల ప్రశ్నలు ఫేస్ బుక్ నిర్వాహకులకు అందాయి. వీటిలో కొన్ని ప్రశ్నలను ఎంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నవారు మోడీని అడగాల్సి ఉంది. అయితే.. తనను ఏ ప్రశ్నలు అడుగుతారో రెండు రోజుల ముందే తనకు చెప్పాలని మోడీ.. కార్యక్రమ నిర్వాహకులకు షరతుపెట్టారట. రెండు రోజుల ముందు ప్రశ్నలు చెబితే.. వాటి సమాధానాలు ముందే సిద్ధం చేసుకోవచ్చని మోడీ భావించారు(?) దీనికి నిర్వాహకులు ఒప్పుకోలేదు. 'లైవ్ చాట్' కాబట్టి ఆ విధంగానే వ్యవహరించాలని వారు మోడీకి సూచించారట. దీంతో.. తాను అసలు కార్యక్రమానికి రానుపోండి.. అంటూ మోడీ డుమ్మా కొట్టాడని టాక్.
   దీనికి బిజెపి మాత్రం సరికొత్త కలరింగ్ ఇస్తోంది. మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్, లాలూ లాంటి తక్కువ స్థాయివారిని పిలిచారని, అందుకే ఆయన వెళ్లలేదని ప్రచారం మొదలు పెట్టారు.

see more at : www.10tv.in

Saturday 1 March 2014

'రాజకీయ విభజన''లో ఎవరి వాటా ఎంత..?



ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 లోక్ సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయింది. అయితే.. వివిధ రకాల ముసుగులు వేసుకుని విభజన కార్యాన్ని పూర్తిచేసిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి పార్టీల ఇందులో వాటా ఎంత..? మొదటి నుంచీ తమ స్వార్థ, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో నాటకాలు ఆడిన ఈ పార్టీలు.. తుది వరకూ ఆటను కొనసాగించాయి. చివరకు.. ప్రజలు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కూడా తేల్చుకోలేని గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. కేవలం ఓట్లు, సీట్లు కోసమే జరిగిన రాష్ట్ర విభజన తంతులో ఎవరి వాటా ఎంతుందో..
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం...   రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సీమాంధ్రలో తమకు కొరకరాని కొయ్యగా మారిన జగన్ ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతో.. మిగిలిన తెలంగాణలోనైనా పట్టు నిలుపుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో...See More 

నాడు వీసా రద్దు చేశారు..! నేడు గాలం వేస్తున్నారు..!! మోడీతో అమెరికా మిలాకత్ దేనికోసం..?!



నిన్నటి వరకూ నరేంద్ర మోడీకి కనీసం వీసా ఇవ్వడానికి కూడా అమెరికా ఎందుకు నిరాకరించింది..?
తన దేశపు గడప తొక్కనివ్వని అమెరికా.. ఇవాళ సప్త సముద్రాలు దాటి వచ్చి ఏకంగా ఆయనతో మీటింగు, చాటింగులకు సిద్ధమవడానికి కారణం..??
మొత్తంగా.. ఇన్నాళ్లూ అల్లంత దూరాన ఉంచిన గుజరాత్ ముఖ్యమంత్రిని నేడు అమెరికా ఆలింగనాలు చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి..???
ఇంతలో వచ్చిన అంతటి మార్పేంటి..?!
మానవ హక్కుల హననానికి పాల్పడ్డాడని...
  2002లో గుజరాత్ లో ముస్లింల ఊచకోతకు కారణమయ్యాడనే కారణంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు అమెరికా వీసా నిరాకరించింది. నాటి నుంచి నేటి వరకూ ఆయనను అమెరికాలో అడుగు పెట్టనివ్వలేదు. ఆ దేశంలోని యూనివర్సిటీల్లో మోడీ ప్రసంగించాలని ఉవ్విళ్లూరినప్పటికీ కుదరదు పొమ్మంది. ఏం చేసైనా అమెరికాలో కాలు మోపాలని భావించిన నరేంద్ర మోడీకి రిక్తహస్తమే చూపించింది. కానీ.. అదంతా గతం...See More

కేజ్రీవాల్ జన లోక్ పాల్ పోరాటం ఫలిస్తుందా..?



అవినీతి నిర్మూలన, ఫెడరల్ వ్యవస్థ బలోపేతం చేయడమే తన లక్ష్యమని, అందుకు తన పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెబుతున్నారు. జనలోక్ పాల్ బిల్లును తక్షణమే ఢిల్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం, హోంశాఖతో పోరాటం చేస్తున్నారు. అయితే.. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కేజ్రీకి కొన్ని రాజ్యాంగపరమైన అడ్డంకులున్నాయి. మరి వాటిని ఆయన అధిగమించగలరా..? కేంద్ర ప్రభుత్వం ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తుంది..? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.....See More

నీ మనసు నాకు తెలుసు..! (బ్లడ్ గ్రూప్ తో అంచనా..!!)



మనకు తెలిసిన వారి మనస్తత్వం గురించి మనకు ఒక అంచనా ఉంటుంది.. వారి ప్రవర్తనపై ఓ అవగాహన ఉంటుంది.. కానీ.. మనకు పరిచయం లేని వ్యక్తుల మనసును పరిశీలించేదెలా..? వారి బిహేవియర్ ను అంచనా వేసేదెలా..?? అంటే.. దానికీ ఓ లెక్కుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక వ్యక్తిని మనం చూడకపోయినా.. కొంచెం కూడా పరిచయం లేకపోయినా.. వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చట..! అయితే.. దీనికి ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ తెలిస్తే చాలు..! మన బ్లడ్ గ్రూప్ ను బట్టే మన మనస్తత్వం ఆధారపడి ఉంటుందని జపనీయులు, కొరియన్లు విశ్వసిస్తారు. కానీ.. ఇన్నిరోజులూ ఈ విషయం నిరూపించబడలేదు. అయితే.. ఇది వాస్తవమేనని తాజా అధ్యయనం తేల్చి చెబుతోంది. ఆ వివరాలు చూద్దాం...
ఓ పాజిటివ్ : ఈ బ్లడ్ గ్రూప్ కలవారు చురుకైన మైండ్ సెట్ కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు, చొరవ, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనే మనస్తత్వాన్ని కలిగి...See More 

నాజూకు అందం.. నాలుగు చిట్కాలతో..!



''నాజూగ్గా ఉండాలంటే.. ఎక్సర్ సైజ్ లు చేయాలి, తిండి తగ్గించాలి, జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు, డాన్సులు చేయాలి, యోగా చేయాలి''..ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. కానీ, ఇలాంటివేమీ చేయకుండానే.. నాజూకుదనాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? భోజనం మానేయడం ద్వారా కాదు.. కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా మీ శరీరం నాజూగ్గా తయారవుతుందన్న విషయం మీకు తెలుసా..? కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ల వల్ల శరీరం నాజూగ్గా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. అయితే.. వీటిని సరైన కొలతలతో తీసుకోవాలి. ఆ కాంబినేషన్లు ఏంటో ఒకసారి చూద్దాం..
గ్రీన్ టీ అండ్ లెమన్...    ఈ ఫుడ్ కాంబినేషన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీకి నిమ్మరసం కలపడం వల్ల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు...See More  

ఇక మోగేది 'సెల్లు' కాదు..'బిల్లే'..! (రాష్ట్రానికి రోమింగ్ షాక్)



ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడకు ఫోన్ చేసినా కాల్ చార్జి మాత్రమే పడేది. కానీ ఇక నుండి రాష్ట్రంలో రోమింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. కనుక ఇక మీదట మీ మాటలను కొంచెం పొదుపుగా వాడండి. లేకపోతే ఇక నుండి మోగేది సెల్లు కాదు.. మీ మొబైల్ బిల్లు.
మొబైల్ కంపెనీలకు పండగే...   సాధారణంగా ఒకే రాష్ట్ర పరిధిలో ఉన్నంత వరకూ ఫోన్ కాల్స్ కు కాల్ ఛార్జి మాత్రమే పడుతుంది. కానీ, పరిధి దాటి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కాల్ ఛార్జితో పాటు.. అదనంగా రూపాయి నుండి మూడు రూపాయల వరకూ ఛార్జి వసూలు చేస్తారు. ఈ అదనపు భారాన్నే రోమింగ్ అంటారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రజల నుండి రోమింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు...See More  

ఊగిసలాటలో 'కిరణ్ పార్టీ'..!



రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'కొత్త పార్టీ' పెట్టనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. కొత్త పార్టీ పేరు 'జై సమైక్యాంధ్రప్రదేశ్ ' అని ఒకరు.. పార్టీ గుర్తు 'చెప్పు' అని మరొకరు.. అంటున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు మార్చి 2న ముహూర్తం ఖరారు చేశారని ఒక వైపు ప్రచారం జరుగుతుంటే.. నిన్నటి దాకా కిరణ్ కు మద్దతు పలికిన నేతలు ఇప్పుడు జారుకుంటున్నారని మీడియా కోడై కూస్తోంది. ఏది ఏమైనా.. కిరణ్ కొత్త పార్టీ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇంతకీ కిరణ్ పార్టీ పెడుతున్నారా..? లేదా..??
కొత్తపార్టీకి మద్దతు కరువు..   సమైక్యాంధ్ర విషయంలో కిరణ్ కు మద్దతుగా ఉన్న నేతలందరూ.. కొత్త పార్టీ విషయంలో మాత్రం వెనకంజవేస్తున్నారు. విభజనకు పార్లమెంటు సైతం ఆమోదం తెలిపిన తర్వాత ఇక.. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. విభజనకు అనుకూలంగా సిడబ్ల్యుసి నిర్ణయం...See More 

మెయిల్ కొట్టు.. 'మీల్' పట్టు.. (రైల్ ప్రయాణీకులకు ఆన్ లైన్ సౌకర్యం)



మంచూరియా, నూడుల్స్, పిజ్జా, బర్గర్ ఈ పేర్లు వింటేనే.. నేటి తరం వాళ్లకు నోరూరుతూ ఉంటుంది. ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే అక్కడ వాలిపోతుంటారు. బయటకు వెళ్లలేనివారు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి మరీ ఇంటికే తెప్పించుకుంటారు. మరి రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు పిజ్జా తినాలనిపిస్తే..? హైదరాబాద్ మీదుగా వెళ్తున్నప్పుడు 'బిర్యానీ' రుచిచూడాలనిపిస్తే..?
ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే చాలు..   మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనం కూర్చున్న చోటికే.. నచ్చిన ఆహారం వస్తే.. ఎంత బాగుంటుందో కదా..? ఇదే ఆలోచనతో పలువురు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను మనకు అందిస్తున్నారు. అది బావర్చి బిర్యానీ అయినా సరే.. డామినోస్ పిజ్జా అయినా సరే. కేవలం ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాదు.. ఇడ్లీ, దోస, వడ లాంటి ఐటెమ్స్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ...See More 

పొలిటికల్ క్యాంటీన్.. (ఇడ్లీ, పాలు, చాయ్ తో నేతలు రెడీ..!)



రండిబాబూ రండి.. రూపాయికే ఇడ్లీ.. మూడు రూపాయలకే పెరుగన్నం. ఫ్రీగా పాలు, చాయ్ అంటూ.. రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు గాలం వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రకరకాల హామీలను ఇవ్వడంతోపాటు.. వారికి క్యాంటీన్ సౌకర్యం కూడా కలిపిస్తున్నారు. అయితే ఇది కేవలం ఎన్నికల వరకే లేండి.
క్యాంటిన్ బిజినెస్ లో ముందున్న జయలలిత..
       
క్యాంటీన్ నడపడంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందరికంటే ముందున్నారు. గత ఏడాది నుండే.. ఆమె క్యాంటీన్ నిర్వహణలో బిజీ అయ్యారు. రూపాయకే ఇడ్లీ అందిస్తూ..తమిళ తంబీలను ఆకట్టుకున్నారు. తక్కువ బడ్జెట్ లోనే టిఫిన్ దొరకడంతో.. జయ ఇడ్లీలకు మార్కెట్ లో బాగానే డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రూపాయలకే పెరుగన్నం అంటూ తన క్యాంటీన్ బిజినెస్ ను ఆమె విస్తరించారు. అంతేకాదండోయ్.. మధ్యాహ్నం వేళలో ఐదురూపాయలకే సాంబార్ అన్నం కూడా ఇక్కడ లభిస్తుంది. ఎంతైనా చెన్నై వాళ్లకు సాంబార్ అంటే ప్రాణం కదా..! దాన్నే జయ తన బిజినెస్ కోసం .. అదేనండీ పొలిటికల్ బిజినెస్ కోసం వాడేసుకున్నారు. తొలిదశలోనే జయమ్మ 200 క్యాంటీన్లు ప్రారంభించిందంటే.. ఈ బిజినెస్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు.

'చాయ్ వాలా' గా మోడీ..        ఇక గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 'చాయ్ వాలా' గా మారి ఓట్లకోసం 'చాయ్' అమ్ముకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో 'మోడీ చాయ్' పేరుతో.. తన 'టీ' రుచిని అందరికీ పరిచయం చేస్తున్నారు. అంతేకాదు...See More 

ఉద్యోగాన్వేషనలో నయా ట్రెండ్..(జాబ్ సెర్చ్ వయా సోషల్ మీడియా)



మీరు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా..? దీని వల్ల టైం వేస్ట్ అవుతుందేమో అనే అనుమానం కలుగుతుందా..? ఇక అలాంటి అనుమానాలకు చెక్ పెట్టేయండి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పలు కంపెనీల్లో సుమారు 20 నుండి 25 శాతం రిక్రూట్ మెంట్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు కన్సల్టెన్సీలు, ప్రకటనల ద్వారా ఉద్యోగ నియామకాలు చేసే కంపెనీలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ పని చేస్తున్నాయట. ఇందుకోసం కొన్ని కంపెనీలు హెచ్ ఆర్ విభాగంలా.. ప్రత్యేకంగా 'సోషల్ మీడియా' విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయట.
        సాధారణంగా కంపెనీ వెబ్ సైట్స్ కు వెళ్లి అక్కడ మన ప్రొఫైల్ కు తగిన జాబ్ ఉందా లేదా అని చూస్తుంటాం. కానీ.. సోషల్...See More  

జాతీయ నేతలను ప్రశ్నించాలా..? అయితే చలో 'ఫేస్ బుక్'..!



రాజకీయ పార్టీ నేతలు ప్రజలకు రోజుకో హామీ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వరాల వర్షం కురిపిస్తారు. అవన్నీ వినే ప్రజలకు ఈ హామీలన్నీ నెరవేరుతాయా..? అనే సందేహం కలగక మానదు. కొంచె ఆర్థిక రంగంపై అవగాహన ఉన్నవారైతే.. మోసపూరిత హామీలు ఎందుకు ఇస్తున్నార్రా బాబూ అంటూ లోలోపల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే.. ఇక మీదట మీ ఆగ్రహాన్ని మీలోనే దాచుకోవాల్సిన పనిలేదు. తప్పుడు హామీలిస్తున్న నేతలను సూటిగా ప్రశ్నించే అవకాశం వచ్చింది. ఇందుకు 'ఫేస్ బుక్' ఒక వేదిక ఏర్పాటు చేస్తోంది.
ఫేస్ బుక్ టాక్స్ లైవ్...        రానున్న ఎన్నికల నేపథ్యంలో సామాన్యులు జాతీయ నేతలను ప్రశ్నించేందుకు 'ఫేస్ బుక్' సంస్థ తన వెబ్ సైట్ లో 'ఫేస్ బుక్ టాక్స్...See More  

వికలాంగుల కోసం ఓ 'యాప్'..!



ప్రస్తుతం మొబైల్ రంగంలో స్మార్ట్ ఫోన్ లు హల్ చల్ చేస్తున్నాయి. రోజుకో కొత్త యాప్ తెరపైకి వచ్చి నెటిజన్లను ఆకర్షిస్తోంది. మహిళల రక్షణ కోసం, ప్రేమికుల కోసం, విద్యార్థుల కోసం ఇలా రకరకాల యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వికలాంగులకోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. దీన్ని యాప్ లాగా డౌన్ లోడ్ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఇంటర్నెట్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ యూజర్స్ కోసం తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇంతకీ ఈ యాప్ ఉపయోగం ఏమిటంటే..?       ప్రస్తుతం ఉన్న రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు తదితర ప్రదేశాలు వికలాంగులకు ఎంతమాత్రం సౌకర్యవంతంగా లేవనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వికలాంగులకు అత్యంత అవసరమైన వీల్....See More  

'ఫేస్ బుక్' సొంతమైన 'వాట్స్ యాప్'..!



 స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరికీ బాగా పరిచయమున్న అప్లికేషన్. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఈ అప్లికేషన్ .. ప్రారంభమై ఐదు సంవత్సరాలు కూడా కాకముందే ఫేస్ బుక్ కు ధీటుగా నెటిజన్లను ఆకర్షించింది. మెసేజ్ లు, ఇమేజ్ లు, ఆడియోలు, వీడియోలు ఫ్రీగా షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గ్రూప్ చాట్ సౌకర్యం కూడా ఉంది. అయితే, మొబైల్ నెంబర్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్ ను .. ఉపయోగించుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. 2009లో కాలిఫోర్నియా కేంద్రంగా ప్రారంభమైన ఈ అప్లికేషన్ నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 కోట్ల మందికి...See More  

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ..? (ఆర్నెల్లపాటు కోల్డ్ స్టోరేజ్ లోనే..!)



ప్రజల నిరసనలు, ఆందోళనలు.. నేతల ఎత్తుగడలు, వ్యూహాలు.. వీటన్నింటి మధ్య రాష్ట్ర విభజన దాదాపు జరిగిపోయినట్లే.. కొన్ని కీలక అంశాలు మినహా విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని అంశం. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. తర్వాత అది తెలంగాణకే చెందుతుంది. మరి సీమాంధ్ర రాజధాని..? ఈ అంశంపైనే ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొని ఉంది. సీమాంధ్రకు కొత్త రాజధానిగా నిలిచేది ఏ నగరం.. బెజవాడ..? విశాఖపట్నమా..?? తిరుపతా..??? లేక మరేదైనానా!? అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
బెజవాడకు అవకాశాలెక్కువ..
  వీటన్నింటిలోనూ.. విజయవాడ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కొత్త రాజధాని ఏర్పాటు చేసేంత స్థలం ఆ నగరంలో లేకపోవడం కొంత మైనస్ పాయింట్ గా ఉంది. ఈ క్రమంలో.. హైద్రాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల స్థాయిలో విజయవాడ - గుంటూరులను...See More  

భూమ్మీద ఉన్నవారందరికీ ఇంటర్ నెట్ ఫ్రీ..! (వరల్డ్ వైఫై తో కనెక్ట్ అయితే చాలు..)



నేడు ప్రతిఒక్కరూ ల్యాప్ టాప్, నోట్ బుక్, ట్యాబ్ లెట్ లేదా స్మార్ట్ ఫోన్.. ఇలా ఏదో ఒక గ్యాడ్జెట్ ద్వారా నెట్ తో కనెక్ట్ అయిపోతున్నారు. ఎక్కడ ఉన్నా సరే.. సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే సంస్థలు ఎక్కువైపోయాయి. 1 mbps – రూ.450 అని ఒకరంటే.. రూ.350 కే 1 mbps నెట్ అందిస్తామని మరొకరు పోటీపడుతున్నారు. మూడు నెలల నెట్ కనెన్షన్ తీసుకుంటే నో ఇన్ స్టాలేషన్ ఫీ అంటూ ఒకరు.. ఆరు నెలలకు తీసుకుంటే 25జిబి డౌన్ లోడింగ్ ఫ్రీ అని మరొకరు నెటిజన్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్ని చెప్పినా.. వీరంతా నెటిజన్ల పర్సు ఖాళీ చేస్తున్నవారే. ఇక ఇలాంటి వారికి చెక్ పెట్టే సమయం వచ్చేసింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఇంటర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాబోతుంది.
ప్రపంచస్థాయి 'వైఫై' గా 'ఔటర్ నెట్'...
ఫ్రీ ఇంటర్ నెట్ కనెక్షనా..? అదీ భూమి మీద ఉన్న ప్రతిఒక్కరికీనా..??...See More 

రాష్ట్ర పాలకుడు ఎవరు..? రాష్ట్రపతా..? కొత్త ముఖ్యమంత్రా..?!



లోక్ సభలో రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లు మూజువాణి పద్దతిలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఆమోదమే మిగిలింది. మరోవైపు, ఇప్పటికే.. సిఎం కిరణ్ రాజీనామా వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే.. సిఎం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? లేక కొత్త ముఖ్యమంత్రి రానున్నారా..? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సిఎం పదవికి కిరణ్ రాజీనామా..?  రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో పాలన స్తంభించింది. శాంతి భద్రతలు కరువయ్యాయి. సిఎం సహా.. మంత్రులు, ప్రధాన పార్టీల నేతలు, ఉద్యోగులు ప్రాంతాల వారీగా...See More  

ముందుంది ముసళ్లపండగేనా..?



సోమవారం నాడు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రజలపై ఎలాంటి భారాలు మోపలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విత్త మంత్రి ఈ విధంగా జాగ్రత్తపడినా.. మనకు మేలే జరుగుతుందిగా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే .. బడ్జెట్ ప్రసంగాన్ని పరిశీలనగా చూస్తే.. ముందు ముందు మనపై అధిక భారం మోపేందుకే ఆర్థిక మంత్రి ఈ విధంగా బడ్జెట్ రూపొందించినట్లు అర్థమవుతోంది. అదే జరిగితే.. సామాన్యుడు భవిష్యత్తులో భరించలేని భారం మోయాల్సిందే..!దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆర్థిక....See More  

దెబ్బ ఒక్కటే.. పిట్టలు మాత్రం మూడు..! కమలం వికసించే దారి ఇదేనా..?!



ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి మీరు వినే వింటారు. ప్రస్తుతం బిజెపి ఈ నానుడినే ఫాలో అవుతుంది. కానీ.. దీంట్లో అడ్వాన్స్ వెర్షన్ ఫాలో అవుతోంది. దెబ్బ ఒక్కటే అయినా, పిట్టలు మాత్రం మూడింటిని కొట్టేయాలని ప్లాన్ వేస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇంతకీ ఏంటా పిట్టలు అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవండి..
తెలంగాణ, సీమాంధ్రలో పాగా వేయడం..   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని.. విభజన నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని బిజెపి పెద్దలు రోజూ మీడియా ముందు గొంతు చించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్.. తమను ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ముందునుండీ అనుకూలంగానే ఉందని...See More 

C.A. విద్యార్థుల కోసం ఓ టీవీ ఛానల్..!



మ్యూజిక్ ఛానెల్, న్యూస్ ఛానెల్, హెల్త్ ఛానెల్ ఇలా రోజుకో కొత్త ఛానెల్ బుల్లి తెరపై ప్రత్యక్షమవుతోంది. తాజాగా ఈ లిస్ట్ లో మరో కొత్త ఛానెల్ చేరబోతుంది. అయితే.. ఇది విద్యార్థులకు ఉపయోగపడే ఛానెల్. అది కూడా కేవలం చార్టెర్డ్ ఎకౌంటెంట్ చదివే విద్యార్థులకు మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న సిఎ విద్యార్థులకు మరింత చేరువవ్వాలనే లక్ష్యంతో ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్...See More  

Youtube.com వయసు తొమ్మిదేళ్లు..!



ఇంటర్నెట్ గురించి తెలిసిన వారికి 'యూట్యూబ్' గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మనం ఏ వీడియో చూడాలన్నా.. ముందుగా ఓపెన్ చేసేది యూట్యూబ్ నే. ఇది ఎన్నో అసాధారణ, అద్భుత వీడియోలను క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుంది. సాంకేతికరంగంలో 'యూట్యూబ్' విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. గూగుల్, ఫేస్ బుక్ స్థాయిలో ప్రజాదరణ కలిగిన 'యూట్యూబ్'.. నేడు తన 9 వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం (2005లో) ఇదే రోజు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గా యూట్యూబ్ ప్రారంభమైంది. ఆ...See more 

ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఫ్రెష్ రోటీ రెడీ..!



మీరు ఏమాత్రం కష్టపడకుండా.. ఆటోమేటిగ్గా రోటీ రెడీ అయితే..? అది కూడా.. రోటీ ఎంత సాఫ్ట్ గా ఉండాలి? ఎంత మందంగా ఉండాలి అని కూడా మీరే డిసైడ్ చేసే అవకాశం ఉంటే..? భలేగా ఉంటుంది కదూ..! ఇదే ఆలోచన సింగపూర్ కి చెందిన ఓ కంపెనీకి వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి కేవలం ఒక్క బటన్ తో ఫ్రెష్ రోటీస్ తయారు చేసే ఓ మిషన్ ను కనిపెట్టారు. మిషన్ అంటే ఇదేదో భారీ సైజులో ఉంటుందనుకుంటే పొరపాటే. చాలా కంఫర్ట్ బుల్ సైజులో దీన్ని డిజైన్ చేశారు. దీనిలో.....See More 

'సెకండ్ హ్యాండ్' కే.. ఫస్ట్ ప్లేస్!



సాధారణంగా సెకండ్ హ్యాండ్ వస్తువులంటే చాలా మంది చిన్నచూపు చూస్తుంటారు. కానీ.. ఇటీవలి కాలంలో ఈ వస్తువులకు డిమాండ్ బాగా పెరుగుతోందట. ఎంతంటే.. కొని సెకన్ల వ్యవధిలోనే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముడుపోతున్నాయట. బ్రాండెడ్ వస్తువులు బయటి మార్కెట్ కన్నా.. ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సుమారు 30 శాతం తక్కువ ధరకు లభిస్తున్నాయి. అది కారైనా,....See more 

పసుపుతో క్యాన్సర్ కు చెక్ ..! అయితే.. వంటల్లో వాడితే ఉపయోగం లేదు..!!



 మనం నిత్యం వంటల్లో వాడే పసుపులో యాంటి బయాటిక్ ఉంటుందని.. ఇది రోగనిరోధక శక్తిలా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే.. ఈ పసుపులో క్యాన్సర్ కణాలు నిరోధించే 'కర్క్యుమిన్' అనే పదార్థం కూడా ఉందట. ఈ పదార్థం ప్రాణాంతకమైన క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుందట. ఈ విషయం కూడా మాకు తెలుసుకదా అని కొందరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలైన విషయం మరొకటి...See More 

సెంచరీ కొట్టిన 'మామ్'..




 మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ను ఇస్రో ప్రయోగించి 100 రోజులైంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్య దాటి.. అంగారకుని వైపు ప్రయాణిస్తుంది. మరో 210 రోజులు ఇదే దిశలో ప్రయాణిస్తే.. అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశిస్తుంది. అంగారక గ్రహంపై జీవాన్వేషణ, వాతావరణం, ఖనిజాల పరిశోధన కోసం ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. మామ్‌ శాటిలైట్‌ అక్కడ ప్రయోగాలు జరుపుతూ ఫలితాలను భూమిపైకి పంపుతుంది. ఈప్రయోగంతో.. అంతరిక్ష యవనికపై ఇస్రో ఓ సువర్ణ అధ్యాయాన్ని నెలకొల్పింది. అంతరిక్ష రంగంలో పేరొందిన అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాల సరసన మనదేశాన్ని నిలిపింది. ఇస్రో గత ఏడాది నవంబర్ 6న ఈ ప్రయోగానికి శ్రీకారం...See more 

ఈ నోటు.. నీటిలో నానదు..చింపినా చిరగదు..నకిలీది దొరకదు..!



ఇక నుండి చిరిగిన నోట్లు మార్చుకునేందుకు బస్ కండక్టర్ తోనో.. లేక పచారీ కొట్టు వారితోనో గొడవపడాల్సిన అవసరం లేదు. అలాగే.. జేబులో మర్చిపోయిన నోట్లను అలాగే ఉతికేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే.. మీరు చింపినా చిరగని నోట్లు.. నీటిలో తడిసినా చెక్కు చెదరని కరెన్సీ మనకు అందుబాటులోకి రానుంది. అదే 'ప్లాస్టిక్ కరెన్సీ'. దీనికి నకిలీ సృష్టించడం కూడా కష్టమేనట..!
లోహం నుండి ప్లాస్టిక్ దాకా...      నకిలీ కరెన్సీని కట్టడిచేసే క్రమంలో .. ఈ ప్లాస్టిక్ కరెన్సీని ఆర్బీఐ అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా రాజ్యసభలో తెలిపారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లు విలువచేసే...See More 

విభజనపై మాది ఒకటే మాట : ప్రకాశ్ కరత్

'ఫేస్ బుక్' వయసు పదకొండేళ్లు..!



ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఊసుపోని కబుర్లు చెప్పుకునే స్థాయి నుంచి ఉద్యమాలకు వేదికగా నిలిచే స్థాయికి చేరింది. దాదాపుగా ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక వ్యక్తి తన ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆక్రందన, సూచన.. మొదలైన వాటిని అభిప్రాయం రూపంలో పంచుకునే సాధనం కావడంతో ఫేస్ బుక్ తక్కువ కాలంలోనే అనితర సాధ్యమైన ప్రగతిని సాధించింది. ఇంతింతై.. అన్న చందంగా ఎదుగుతూ వచ్చిన 'ఎఫ్ బీ' కి నేటితో పదేళ్లు పూర్తై పదకొండో ఏట అడుగు పెడుతోంది. నెటిజన్లలో తనదైన మేనియా క్రియేట్ చేసిన ఫేస్ బుక్ పుట్టిన రోజు సందర్భంగా దాని పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం..
1..2..3..        ప్రపంచంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు ఫేస్ బుక్ వినియోగిస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మంది ఫేస్ బుక్...See More  

'అద్దేపల్లి'తో ముఖాముఖి..

భద్రాద్రి రాముడు.. మునుగుతాడా..? తేలుతాడా..??



భద్రాద్రి రామయ్యకు మహాగండం వచ్చిపడింది..! ఎటూ తప్పించుకునే వీళ్లేని 'జలగండం' పొంచి ఉంది. కోరిన కోర్కెలు తీర్చి, భక్తజనుల కష్టాలు కడతేర్చే దేవుడిగా పేరొందిన స్వామికి ఇప్పుడు.. తీరని కష్టం వచ్చి పడింది. భద్రగిరిని ముంచేందుకు 'పోలవరం' రూపంలో గంగమ్మ వేచి చూస్తోంది. మరి.. ఈ పరిస్థితుల్లో రాముడు మునిగిపోతాడా..? తనను తాను రక్షించుకుంటాడా..??
భవిష్యత్ లో రామయ్య దర్శనం కలిగేనా..?        ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొన్ని సవరణలతో ఆ తంతు ముగించింది. ఇందులో ప్రధానమైంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. మొన్నటి వరకూ భద్రాచలం డివిజన్ తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించిన కేంద్రం.. సీమాంధ్రుల ఆందోళనతో కాస్త మెత్తబడింది. పోలవరం ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు సమ్మతించింది. ఇందులో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లకు చెందిన 9 మండలాలు ఉన్నాయి. భద్రాద్రి పట్టణాన్ని మాత్రం తెలంగాణకు వదిలిపెట్టింది. అయితే.. రామయ్యను తెలంగాణ వారికే...See more 

జలయజ్ఞం నిధులు ప్రాజెక్టుల నిర్మాణానికా..? కాంట్రాక్టర్ల జేబుల్లోకా..?? (ప్రతీ బడ్జెట్ లో నిధుల వరదే..!)



ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో జలయజ్ఞానికి కేటాయిస్తున్న నిధులు ఎక్కడికెళుతున్నాయి..? నిజంగా ఆ నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారా..? ఒక వేళ ప్రాజెక్టులకే ఖర్చు చేస్తే ఒక్కటి కూడా పూర్తి కాలేదెందుకు..?! లేదంటే.. ఈ పేరుతో కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకుంటున్నారా..? అనే ప్రశ్నలకు సమాధానం లభించట్లేదు. తాజాగా.. 2014 -15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనూ మరోమారు జలయజ్ఞానికి రూ. 20 వేల కోట్లు కేటాయించడం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా గుత్తేదారుల జేబుల్లోకే పంపేందుకే ప్రభుత్వం ఈ మొత్తాన్ని కేటాయించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
లక్షల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు...   రాష్ర్టంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే 26 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు అందుకు....See more