Friday 2 May 2014

పవన్...ఆరంభం నాటి ఆవేశమేదీ?

Pawan Kalyan
హైదరాబాద్ : ఏవి నిరుడు వీచిన ఆగ్రహ పవనాలు? ఏవి తమ్ముడూ ప్రజాకాంక్షలను నెరవేరుస్తానంటూ ఎత్తిన జన సేన జెండా రెపరెపలు? జనసేన పార్టీ నేత పవన్‌ కల్యాణ్‌ తూటాల్లాంటి మాటలు... బట్టీ పట్టిన డైలాగ్‌లేనా? సీమాంధ్రలో ఎన్నికల అనంతరం జనసేన డిజాల్వ్ అయిపోతుందా? అన్న చిరంజీవి అడుగుజాడలను అనుసరిస్తానన్న పవన్‌... పార్టీ విషయంలోనూ అన్ననే ఆదర్శంగా తీసుకుంటారా?
    రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయనీ, ఆ రాజకీయాలను మార్చడానికే తాను జనసేన పార్టీని స్థాపించానంటూ చెప్పిన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కు హఠాత్తుగా జ్ఞానోదయమైపోయింది. జనసేన వద్దూ, గినసేన వద్దు. సీమాంధ్రలో టీడీపీకి, దేశంలో మోడీకి పగ్గాలు అప్పగిస్తే చాలు.. సబ్‌ ఖుష్‌. అన్నీ సమస్యలనూ వాళ్లిద్దరే తీర్చేస్తారని పవన్ అనుకుంటున్నారా ? అందువల్ల ఇక జనసేనను కొనసాగించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇదీ ఇండైరెక్ట్ గా పవన్‌ సూచన. చూడబోతే ఎన్నికల ఫలితాల అనంతరం జనసేనను టీడీపీలోనో, బీజేపీలోనే కలిపేసి... బదులుగా ఓ మంత్రి పదవిని పుచ్చేసుకుని తమ్ముడు కూడా అన్నదారినే అనుసరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
 అన్న చిరంజీవికి జ్ఞానోదయం కావడానికి ఒకసారి ఎన్నికలు జరగాల్సి వస్తే... తమ్ముడికి మాత్రం ఎన్నికల ముందే జ్ఞానోదయం అయిపోయినట్లు కనిపిస్తోంది. తిరుపతి సభలో పవన్‌ మాటల తీరును చూస్తే అర్థమౌతుంది.
పవన్ పార్టీ పెటాల్సినవసరం ఏముంది ?
   
మరి చంద్రబాబు అంత సమర్థుడిగా కనిపిస్తే.. పవన్‌ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటి? జనసేన పార్టీ పెట్టే ముందు పవన్‌ కళ్యాణ్‌ కళ్లకు చంద్రబాబు సమర్థత కనిపించలేదా? ఆ మాత్రం దానికి పార్టీ పెట్టి అభిమానులు, రాష్ట్ర ప్రజల్లో ఆశలు రేకెత్తించాల్సిన అవసరమేముంది? తిరుపతి సభలో పవన్‌ కళ్యాణ్‌ ఎంత సేపూ చంద్రబాబు, మోడీల భజన చేయడం చూసిన పవన్‌ అభిమానులకు మతిపోయినంత పనైంది.
అభిమానుల ఆగ్రహం..
పార్టీ పెట్టడానికి బదులు సమర్థులైన చంద్రబాబు సమక్షంలోనో, మోడీ సమక్షంలోనో టీడీపీదో, బీజేపీదో తీర్థం పుచ్చుకొని ఉంటే సరిపోయేదిగా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment