Friday 2 May 2014

ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూపు- సీతారాం ఏచూరి



విశాఖపట్నం: కాంగ్రెస్, బిజెపి రాజకీయ, ఆర్ధిక విధానాలలో తేడాలేదని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఆర్ధిక వృద్ధి చేకూరుతుందని చెప్పారు. అటువంటి ప్రత్యామ్నాయ విధానాల కోసం సీపీఎం కృషిచేస్తుందని తెలిపారు. మనదేశాన్ని మతోన్మాద రాజకీయాల నుంచి కాపడడం తమ పార్టీలక్ష్యమని చెప్పారు. గుజరాత్ మోడల్ అభివృద్ధితో దేశం అధోగతి పాలవుతుందని అన్నారు. గాజువాఖలో సీపీఎం అభ్యర్ధి సి.హెచ్.నర్సింగరావును గెలిపించాలని కోరారు.

No comments:

Post a Comment