Friday 2 May 2014

సీమాంధ్రపై వరాల జల్లు కురిపించిన సోనియా...

Sonia Gandhi


గుంటూరు : సీమాంధ్ర ప్రజలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరాల జల్లు కురిపించారు. గురువారం నగరంలోని పొన్నూరు రోడ్డు ఆంధ్రా ముస్లీం కళాశాల ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు సోనియా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజల మీద వరాల జల్లు కురిపించారు. టిడిపి, బిజెపి, వైసిపి పార్టీలపై విమర్శలు చేశారు. సోదర..సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో సోనియా ప్రసంగించారు. ఆమె ఏమన్నారో..ఆమె మాటల్లోనే..
చాలా ఆలోచించాం..
 
సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే ఉద్ధేశ్యంతో చాలా ఆలోచించిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల లేఖలు ఇచ్చాయి.
విద్యార్థులు ఆందోళన చెందవద్దు..
విభజన చేయడం వల్ల హైదరాబాద్ విద్యా సంస్థల్లో అవకాశాలు పోతాయని ఆందోళన చెందవద్దు. పదేళ్ల పాటు విద్యావకాశాల్లో యథాతథ స్థితి కొనసాగుతుంది. ఈలోపల పలు ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పుతాం.
2009 హామీలను నెరవేర్చాం...
 
గుంటూరు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే నగరం. హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఇచ్చాం. 2009లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.
బీజేపీ - టీడీపీ తోడు దొంగలు..
 
ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఎలానో టీడీపీ - బీజేపీ అలాగ. వీరిద్దరూ తోడు దొంగలు. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో ఎన్డీయే మిత్రులు బయటకు వెళ్లారు. తాజాగా టీడీపీ, బీజేపీతో కలిసింది. మతతత్వ శక్తులను ప్రోత్సాహించినట్లే. కాంగ్రెస్ అందర్నీ గౌరవిస్తుంది. అందులో భాగంగా ఇందిరా, రాజీవ్ గాంధీలు బలయ్యారు.
వైఎస్ పేరు పెట్టుకుని దుష్రచారాం..
 
వైఎస్ కాంగ్రెస్ వ్యక్తిగా పనిచేశారు. కాంగ్రెస్ కూడా ఆయనకు పదవువలనిచ్చి పోత్సాహించింది. కానీ ఆయన పేరు పెట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంటేనే అందరికీ గుర్తింపు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ప్రతీక.
చిరంజీవి, రఘువీరా భేష్...
 
సీమాంధ్ర మేనిఫెస్టోను చిరంజీవి, రఘువీరారెడ్డిలు బాగా రూపొందించారు. మేనిఫెస్టోలో రూపొందించిన వాటిని పక్కాగా అమలు చేస్తాం. ఇది నా ప్రామిస్.
ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి..
 
ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మతతత్వ పార్టీ కావాలో..లౌకికమైన ప్రభుత్వం కావాలో...ఢిల్లీలో లౌకిక ప్రభుత్వం, సీమాంధ్ర అభివృద్ధిని చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి..జై హింద్..జై కాంగ్రెస్..జై సీమాంధ్ర''
ఈ బహిరంగ సభలో దిగ్విజయ్ సింగ్, చిరంజీవి, రఘువీరారెడ్డి, జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.
సోనియా హామీలు...
  • కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతాం.
  • విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తాం.
  • నెల్లూరులో దుగరాజపట్నం పోర్టు.
  • సీమాంధ్ర ప్రాంతానికి న్యూ రైల్వే జోన్ ఏర్పాటు.
  • రెండు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. (కేంద్ర విశ్వవిద్యాలయం. పెట్రోలియం యూనివర్సిటీ)
  • సీమాంధ్రకు స్పెషల్ ఆర్థిక నిధులు.
  • రైతుల రుణాలు మాఫి చేస్తాం.
  • ఆరోగ్య హక్కును చట్టబద్ధత చేస్తాం.
  • పక్కా ఇళ్లు, వృద్ధులు, వింతంతువులకు ఉన్న పెన్షన్ లను చట్టబద్ధత కలిగించేలా చేస్తాం

No comments:

Post a Comment