Wednesday 30 April 2014

టీఆర్‌ఎస్‌లో నూతనోత్సాహం..

TRS


హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఎన్నికలు, కొత్త రాష్ట్రంలో మొదటి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జరిగిన పోలింగ్ సరళి, పెరిగిన పోలింగ్ శాతం ఆ పార్టీ విశ్వాసాన్ని మరింత పెంచింది. అధికార పగ్గాలపై ఆశలను రెట్టింపు చేసింది.
కాంగ్రెస్ నేతల కుదేలు..
         
కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయడం ఆ పార్టీకి మైనస్ అని 40 సీట్లకు మించి రావనే చర్చ ఎన్నికల ప్రారంభంలో జరిగింది. కానీ రాజకీయ మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ తన వ్యుహాలకు పదును పెట్టడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు కేసీఆర్ కౌంటర్ ఎటాక్ కు పొన్నాల, దామోదర లాంటి నేతలు మాట్లాడినా దిగదుడుపే అయ్యింది. చివరకి టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలనూ చేర్చుకొని వారితో కేసీఆర్ ను తిట్టించినా కేసీఆర్ మాటల యుద్ధం ముందు కాంగ్రెస్ నేతలు బావురమన్నారు. వీటికి తోడు మూడో ఫ్రంట్ కు అనుకూలమని, మోడీ దుష్మన్ అంటూ చేసిన ప్రకటనలు, మైనార్టీల అండ తమ పార్టీకి పెరిగేందుకు తోడ్పడ్డాయనే భావన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
కలిసొచ్చిన పవన్‌ వ్యాఖ్యలు..!
            
గతం వారం రోజులుగా తెరపైకి తెచ్చిన మోడీ యూటీ ప్రకటన కేసీఆర్ కు యూత్ లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని విశ్లేషకులంటున్నారు.ఇక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ హైదరాబాద్ ను యూటీ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటన చేయిపిస్తారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య యూత్ లో టీఆర్ఎస్ కు మరింత ఓట్లు తెచ్చిపెట్టాలా చేసి ఉండవచ్చనే అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ ను కేసీఆర్ మీదకు బిజెపి, టీడీపీ నేతలు వదిలారు. కానీ పవన్ వ్యాఖ్యలు కేసీఆర్ కు మరింతగా ప్లస్ అయ్యాయని విశ్లేషకులంటున్నారు. మొత్తానికి పెరిగిన ఓటింగ్ శాతం యూత్ ఓటింగ్ లో పాల్గొన్నారనే సంకేతం పంపుతోంది. ఇది టీఆర్ఎస్ ఓటే కావొచ్చనే అనే చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్‌లో పెరిగిన ఆశలు..
       
టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ ఓటింగ్ శాతం పెరగడం పార్టీలో ఆశలు మరింత పెంచుతోంది. మొత్తానికి గులాబీ దళానికే అత్యధిక సీట్లు వస్తాయనే చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ జరుగుతోంది. అయితే ఈవిఎంలో నిక్షిప్తమైన నేతల, పార్టీల తలరాత తెలుసుకోవాలంటే మరో పదిహేను రోజులు ఆగాల్సిందే.

No comments:

Post a Comment