Thursday 24 December 2015

వరకట్న వేధింపులకు గర్భిణీ బలి...

హైదరాబాద్ : నగరంలో ఘోరం జరిగింది. వరకట్న వేధింపులకు మరో మహిళ బలి అయింది. శ్రీమంతం చేయించుకోవాల్సిన వేల మృత్యుఒడిలోకి వెళ్లింది. వరకట్న వేధింపులు భరించలేక ఓ ఐదునెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరుకు చెందిన యోగేష్,www.10tv.in
విజయవాడకు చెందిన లక్ష్మీలకు 2013 లో వివాహం జరిగింది. యోగేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. కాగా లక్ష్మీ పోస్టల్ డిపార్టు మెంట్ లో అసిస్టెంట్ క్లర్కు గా పని చేస్తోంది. హైదరాబాద్ లోని బేగంపేటలో నివాసం ఉంటున్నారు.  అయితే వివాహ సమయంలో యోగేష్ కు సాఫ్ట్ వేర్ ఉద్యోగం రాలేదు. అతను తక్కువ కట్నానికి పెళ్లి చేసుకున్నాడు. అయినా లక్ష్మి తల్లిదండ్రులు యోగేష్ కు రూ. పది లక్షల కట్నం ఇచ్చారు. అయితే కొన్నాళ్లకు యోగేష్ కు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఈనేపథ్యంలో అదనపు కట్నం కావాలంటూ... భార్య లక్ష్మీని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం బేగంపేట్ మహిళా పీఎస్ కేసులో వరకట్న వేధింపుల కింద అతనిపై కేసు నమోదు అయింది.. అయితే... అయితే పోలీసులు కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి వదిలిపెట్టారు. రూ.20 లక్షల కావాలంటూ.. మళ్లీ వేధిస్తున్నాడు. ఈనేపథ్యం భర్త వేధింపులు తట్టుకోలేక ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య లక్ష్మీ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు లక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని తల్లిండ్రులు బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదనపు కట్నం కావాలని యోగేష్ డిమాండ్ చేయడంతోనే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యోగేష్ తన సెల్ ఫోన్ తో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వారి బంధువుల వద్ద కూడ అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. గతంలో బేగంపేట పీఎస్ నమోదు అయిన కేసు కూడా విచారణలోనే ఉంది. ఈనేపథ్యంలో యోగేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments:

Post a Comment