Monday 21 December 2015

ఒక గ్లాస్ జ్యూస్ తో..

మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఆకర్షణీయమైన చర్మాన్ని మనం సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా...
వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఓ గ్లాసుడు యాపిల్‌ జ్యూస్‌ తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే క్యారెట్‌ జ్యూస్‌ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఎంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటిని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్‌ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు. ఇకపోతే, బీట్రూట్‌ జ్యూస్‌ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా ఇది లివర్‌కు కూడా మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే బీట్రూట్‌ రసం తీసుకుంటే బయటకు పోతాయట. అన్నింటికంటే ముఖ్యంగా ఎర్ర రక్తకణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టమాటాలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు

No comments:

Post a Comment