10TV is a 24 Hour Telugu News channel. Telugu Breaking news, Hyderabad Breaking News, Movie News, Telugu Cinema News, Sports News, Telugu Exclusive, Telangana, Andhra Pradesh will plays in 10TV. Ten TV Live also available in www.10tv.in.
Wednesday, 30 April 2014
చెన్నయ్ రైల్వేస్టేషన్ లో పేలుడు- ఒకరి మృతి
![]() |
| Bomb Blast |
చెన్నయ్: చెన్నయ్ సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం 7 గంటల 30 నిమిషాల ప్రాతంలోఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నయ్ రైల్వే స్టేషన్లోని 9వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న బెంగళూరు- గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్-4 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే స్టేషన్ లో పోలీసులు బాంబు స్వ్కాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు.
అరవైలో ఇరవై (పెళ్లికొడుకుగా డిగ్గీరాజా)..
![]() |
| Digvijaya Singh |
గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిన డిగ్గీ...
అంతకంటే ముందు డిగ్గీరాజా, అమృతారాయ్ ఎఫైర్ ఇంటర్నెట్ లో, రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల సమయంలో ఈ ఫొటోలు బయటకు రావడంతో డిగ్గీ పరువు బజారున పడింది. బీజేపీ దీనిని అస్త్రంగా చేసుకునేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయం కావడంతో విపక్షాల విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని డిగ్గీ భావించారు. విమర్శలకు ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాననంటూ తన మనసులోని కోరికను ట్విట్టర్ లో తెలిపాడు. అమృతారాయ్ తో సాన్నిహిత్యం ఉన్న మాట నిజమేనంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకుంటానని ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికి అమృతాయ్ కూడా పెళ్లికి సుముఖత తెలిపినట్లు తెలిసింది. మొత్తం మీద డిగ్గీరాజా పెళ్లిపై వచ్చిన గాసిప్స్ కి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇటు ప్రత్యర్థులుకు అవకాశం ఇవ్వకుండా, పెళ్లికి ఎలాంటి ఇబ్బందీ ఉండకుండా దిగ్విజయ్ వ్యవహరించారని అతని సన్నిహితులు అంటున్నారు
నేడు మేడే..
![]() |
| May Day 10tv.in |
హైదరాబాద్: మే 1 (నేడు) మేడే. పెట్టుబడిదారీ వర్గ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం నినదించిన రోజు. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. అది చేస్తున్న నిరంతర శ్రమ. శ్రామికశక్తితోనే మానవ సంస్కృతి వికసించి ముందడుగు వేస్తోంది. కానీ ఆ శ్రమే బండచాకిరీగా మారినపుడు ఏమవుతుంది? శ్రామికుడు దారుణంగా దోపిడీకి గురైనపుడు ఏం జరుగుతుంది? కష్టించే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయ్. భూకంపం సృష్టిస్తాయ్. ఉద్యమాలు పుట్టుకొస్తాయి.
130 ఏళ్ల క్రితమే కార్మికోద్యమం..
పెట్టుబడీదారీ ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ళ క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు జరిగినపుడు చిందిన వెచ్చని నెత్తురే కేతనమై ఎగసింది.
అది అమెరికాలోని చికాగో నగరం..1886 మే 1
అమెరికాలోని చికాగోలో కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న రోజులవి. కార్మికులు రోజుకి 18-20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలమది. పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించే వారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలకోసం ఆరేడేళ్ళ పిల్లలతోనూ, మహిళలతనూ ఫ్యాక్టరీల్లో, గనుల్లో పనిచేయించారు. కార్మికులు చాకిరీ కొలిమిలో కుతకుతలాడిపోయిన సందర్భమది.
ఆ దోపిడీ రాపిడిలోంచి తిరుగుబాటు అగ్గి రాజుకుంది. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికుల 1886 మే 1 ఉద్యమించారు. ఆ రోజు కార్మికవర్గ చైతన్యం వెల్లివిరిసింది. చికాగో నగర వీధుల్లో ఉత్సాహవంతులైన కార్మికుల కదం తొక్కారు. మూడున్నర లక్షలమంది కార్మికులు పోరాటబాట పట్టిన సార్వత్రిక సమ్మె అది. ఆ ఉద్యమం ప్రపంచవ్యాపితమై పెల్లుబికింది. అదే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా ప్రసిద్ధి కెక్కింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గ చైతాన్యాన్ని ఏవిధంగానైనా నాశనం చేయాలని పెట్టుబడిదారి వర్గం నిర్ణయించుకుంది. దానికి ప్రభుత్వం అండగా నిలిచింది.
అదే ఏడాది మే 3న శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మిక జనసమూహంపై అమెరికన్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా మే 4న హే మార్కెట్‌లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రశాంతంగా సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. మధ్యలో బాంబు ప్రయోగం కూడా జరిగింది. ఒక పోలీసు సార్జెంట్ చనిపోయాడు. అది సాకుగా తీసుకుని పోలీసులు నిరాయుధులైన కార్మికులపై తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ సంఘర్షణలో ఏడుగులు పోలీసులు చనిపోగా నలుగురు కార్మికులు నేలకొరిగారు. హే మార్కెట్ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. అక్కడే ఆవిర్భవించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాడి శ్రమజీవుల స్వేచ్ఛా సంకేతమైన అరుణపతాకం.
ఏ దేశంలోనైనా సమాజామార్పునకు చోదక శక్తి కార్మికవర్గమే. మనలాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికులకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలోని ఇతర వర్గాలను కలుపుకుని ఉద్యమాలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ భారతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, ఇతర సమస్యలపై ఉద్యమాలను నిర్మించాల్సి ఉంటుంది. రైతులతో ఇతర వర్గాలతో కార్మికులు భుజం,భుజం కలిపి పోరాడాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకుసాగాలి.
మోడీపై కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు..
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్ లో ఓటు వేసిన మోడీ..ఎన్నికల గుర్తు కమలం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ ప్రకారం పోలింగ్ బూత్ కు వంద మీటర్ల లోపు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఎన్నికల గుర్తు చూపడంతో పాటు ప్రసంగించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ పేర్కొంది.
తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు- రాఘవులు
![]() |
| bv raghavulu |
హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుక్ను ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోని తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని సూచించారు.
Subscribe to:
Posts (Atom)






